బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 31, 2020 , 02:20:11

ప్రమాదాల నియంత్రణ కోసమే..

ప్రమాదాల నియంత్రణ కోసమే..
  • రోడ్డు భద్రతా వారోత్సవాలు : ఆర్టీవో

నాగర్‌కర్నూల్‌ టౌన్‌ :  ప్రమాదాల్ని నివారించేందుకు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్టీవో ఎర్రిస్వామి పేర్కొన్నారు. గురువారం స్థానిక ఆర్టీవో కార్యాలయ ఆవరణలో 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలను నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న వాహనాలకు అనుగునంగా రోడ్లు పెరుగుదల, అవగాహన లేకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జిల్లా రవాణాశాఖ నిబంధనలను పాటిస్తూ తగు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల తీవ్రత తగ్గుతుందన్నారు. మైనర్లు లైసెన్స్‌లు లేకుండా వాహనాలు నడపడం, నిబంధనలకు విరుద్ధమని, ముగ్గురు, నలుగురు ఒకే బైక్‌పై ప్రయాణించడం వంటివి ప్రమాదాలకు కారణాలుగా చెప్పారు. పట్టణ, పరిసర ప్రాంతాల్లోని లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.  రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన ఎన్నో జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఆటో, లారీ డైవర్లు, ఆర్టీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


logo