బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 31, 2020 , 02:17:59

యూరియా అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు

 యూరియా అధిక రేట్లకు విక్రయిస్తే కఠిన చర్యలు

బిజినేపల్లి : రైతులకు ఎరువులను ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రేట్లకు విక్రయిస్తే సంబంధిత డీలర్లపై చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దు చేస్తామని డీఏవో బైరెడ్డి సింగారెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ  ద్వారా రైతులకు యూరియా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఉద్దేశంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈ తనిఖీలను నిర్వహించడం జరిగిందన్నారు. రూ.330ల చొప్పున యూరియా విక్రయాలు జరుపుతున్నారని తనిఖీలు చేయడం జరిగిందన్నారు. యూరియా ఉన్న షాపులలో ఏఈవోల ద్వారా ఎంఆర్‌పీ  ధరలకే రైతులకు యూరియాను విక్రయించడం జరుగుతుందన్నారు. బిజినేపల్లి మండలంలో 200ల మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, అవసరమైన వారు సంబంధిత వ్యవసాయాధికారిని సంప్రదించి తీసుకువెళ్లాలన్నారు. మండలంలో 2640 ఎకరాల వరి సాగు చేయడం జరుగుతుందని, 454 ఎకరాల మొక్కజొన్న సాగు చేయడం జరుగుతుందని తెలిపారు.  జిల్లా మొత్తంలో 1483 మెట్రిక్‌ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.  అవసరం ఉన్న వెంబడే సొసైటీల ద్వారా యూరియాను రైతులకు అందజేయడం జరుగుతుందన్నారు. అనంతరం పలు ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అంతకముందు విండో కార్యాలయాన్ని సందర్శించారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటస్వామి, ఏవో నీతి ఉన్నారు. logo