శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 30, 2020 , 01:24:48

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

అపర భగీరథుడు సీఎం కేసీఆర్‌

చారకొండ: పేదల పక్షపాతి సీఎం కేసీఆర్‌ అని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యులు రాములు అన్నారు. గురువారం మండల కేంద్రంలో 33/11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతితో కలిసి ప్రారంభించారు. ఈ  వారు మాట్లాడుతూ..  వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చెప్పారు. సాగునీరు, నిరంతర విద్యుత్‌, రైతు సమస్యల పరిష్కారానికి దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటి సారిగా సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథ  అమలు చేస్తున్నారన్నారు.  రాష్ట్రంలో ఎప్పు  ఎన్నికలు వచ్చిన ప్రజలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారని చెప్పారు. పురపాలక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. 


పేద ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి పథకం

పేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం వరంలాంటిదని ఎంపీ రాములు అన్నారు. చారకొండ మండలానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్‌ పర్సన్‌ పద్మావతితో కలిసి చెక్కులను అందజేశారు. పేద ఆడబిడ్డల పెండ్లీ సమయంలో కల్యాణ లక్ష్మి పథకం కుటుంబానికి అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బాలాజీసింగ్‌, ఎంపీపీ నిర్మల విజేందర్‌గౌడ్‌, విద్యుత్‌ డీఈ శ్యాసుంధర్‌రెడ్డి, ఏడీ శ్రీనివాసులు, ఏఈ జలంధర్‌, తాసిల్ద్దార్‌ నాగమణి, ఎంపీడీవో జయసుధ, వైస్‌ ఎంపీపీ బక్కమ్మ, సర్పంచులు విజేందర్‌గౌడ్‌, యాతం శారధశ్రీను, నరేశ్‌నాయక్‌, ప్రశాంత్‌నాయక్‌, ఎంపీటీసీలు గ్యార లక్ష్మణ్‌, లక్ష్మణ్‌నాయక్‌, రైతు సమితి మండల అధ్యక్షుడు గజ్జెయాద  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవీందర్‌, నాయకులు గురువయ్య, కమలాకర్‌రావు, నరేందర్‌రెడ్డి, జానపండు, తిరుమల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


కొండారెడ్డిపల్లిలో నూతన సబ్‌స్టేషన్‌ ప్రారంభం

వంగూరు:ఎన్నో కొత్త సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతాంగానికి సాగునీటిని అందిస్తున్న అపర భగీరథుడు సీఎం  అని ఎంపీ రాములు,ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజులు అన్నారు.  మం  కొండారెడ్డిపల్లి గ్రామంలో రూ.2.08 కోట్ల  నిర్మించిన 33బై11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేన్‌ను వారు ప్రారంభించారు.  సందర్భంగా ఎంపీ  మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్నో సబ్‌స్టేషన్లను నిర్మించి రైతులను ఆదుకుంటున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 

ఎమ్మె  గువ్వల బాలరాజు  గత ప్రభుత్వం  కేఎల్‌ఐ ద్వారా  మండలానికి కేవలం 3 వేల ఎకరాలు సాగులోకి వచ్చే విధంగా ప్రణాళిక చేపట్టారని,  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి వాటిని 30 వేల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చామన్నారు.  చెక్కులను లబ్ధిదారులకు వారు అందజేశారు.  ఎంపీపీ    కేవీఎన్‌రెడ్డి,  శ్యాంసుందర్‌రెడ్డి,  శ్రీనివాసులు,  రాజునాయక్‌,  టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నరేందర్‌రావ్‌,  అధ్యక్షుడు కృష్ణారెడ్డి,సింగిల్‌విండో డైరెక్టర్‌ సురేందర్‌రెడ్డి , పాల్గొన్నారు.


logo