సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Jan 30, 2020 , 01:16:27

వేర్వేరు గ్రామాల్లో ఇద్దరి మృతి

వేర్వేరు గ్రామాల్లో ఇద్దరి మృతి

ధరూర్‌/కొత్తకోట : ఉమ్మడి జిల్లాలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ సంఘటనలతో నీలహళ్లి, కొత్తకోటలో విషాదచా యలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

ధరూర్‌ మండలం నీలహాళ్లి గ్రామానికి చెందిన బోయ శ్రీను బుధవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మృతి చెందాడు. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు.. ఎస్సై రాములు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అదే గ్రామానికి చెందిన ఆటో కుర్వ ఆంజనేయులు ఇంటికి  వెళ్లాడని, తర్వాత ఏం జరిగిందో  ఏమో ఇంటికి కిందపడి చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. శరీరంపై చిన్నచిన్న గాయాలు ఉన్నాయని చెప్పారు. బోయ శ్రీను(35) మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా దవాఖానకు తరలించామన్నారు పోస్ట్‌మార్ట్టం రిపోర్టులో వచ్చిన వివరాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. మృతునికి భార్య లక్ష్మి ఉందన్నారు.

అలాగే కొత్తకోట మున్సిపల్‌ కేంద్రంలోనూ మరో వ్యక్తి మృత్యువాత పడిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కొత్తకోట ఎస్సై విజయభాస్కర్‌ తెలిపిన వివరాల మేరకు.. మున్సిపల్‌ కేంద్రంలోని పాత విద్యుత్‌ కార్యాలయం వద్ద వ్యక్తి మృతదేహం ఉందని బుధవారం స్థానికులు సమాచారం ఇచ్చారన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టామన్నారు. మృతుడు కొత్తకోట మున్సిపల్‌ కేంద్రానికి చెందిన మేస్త్రీ బుగ్గపల్లి రాజు (45)గా గుర్తించామన్నారు. అధికంగా మద్యం తాగడం వల్లనే మృతి చెంది ఉంటాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. 


logo