బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 29, 2020 , 02:04:30

సామాన్య కార్యకర్తకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి

సామాన్య కార్యకర్తకు మున్సిపల్‌ చైర్మన్‌ పదవి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: పేద కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్త కల్పనాభాస్కర్‌గౌడ్‌కు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వడం సర్వత్రా హర్షించదగ్గ విషయమైని టీఆర్‌ఎస్‌ పార్టీ నేత, నగర పంచాయతీ మాజీ చైర్మన్‌ వంగా మోహన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ వంగా శరత్‌బాబుగౌడ్‌లు అన్నారు. మంగళవారం స్థానిక వీఎన్‌  భవనంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ  వారు మాట్లాడుతూ   నాగర్‌కర్నూల్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ, నగర పంచాయతీ ఉన్న కాలంలోనూ గౌడ కులస్తుల పాలనే సాగిందని, మరోసారి నాగర్‌కర్నూల్‌ పట్టణ ప్రజలకు సేవచేసే అవకాశం గౌడ కులస్తులకు దక్కడం సంతోషంగా ఉందన్నారు. బీ.సీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్‌, కేటీఆర్‌ సూచన మేరకు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు బీసీ వర్గానికి చెందిన గౌడ కులస్తులకు చైర్మన్‌ పదవిని, ఓసీలకు వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టడం సర్వత్రా హర్షనీయమన్నారు. నాగర్‌కర్నూల్‌లో మున్సిపల్‌లో 24 మంది కౌన్సిలర్లలో సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నప్పటికీ పార్టీనే నమ్ముకొని ఉన్న నాయకులు కల్పనాభాస్కర్‌గౌడ్‌కు చైర్‌పర్సన్‌ పీఠం దక్కడం సంతోషమన్నారు.  ఎమ్మెల్సీల సహాయ సహకారాలతో నాగర్‌కర్నూల్‌ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ పట్టణ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వచ్చాక ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. కొత్త పాలక మండలి ఆధ్వర్యంలోనూ నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీని రాష్ట్రంలోని అభివృద్ధిలో ముందుండేలా చూడాలని కోరారు. ఈ సమావేశంలో నాగరాజుగౌడ్‌, సత్యంగౌడ్‌, బాలస్వామిగౌడ్‌, ఎల్లగౌడ్‌, గిరిగౌడ్‌, భాస్కర్‌గౌడ్‌, రమేశ్‌గౌడ్‌, మురళిగౌడ్‌, బాల్‌రాజుగౌడ్‌, రాఘవేందర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo