బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 29, 2020 , 02:01:40

శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

శ్రీశైల క్షేత్రంలో ప్రత్యేక పూజలు

శ్రీశైలం: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం ప్రత్యేక పూజాధికాలను సర్కారీ సేవలుగా నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. మంగళవారం ఆలయ ప్రాంగణంలోని కుమారస్వామికి పంచామృతాభిషేకాలు చేశారు. శివభక్త గణాలకు అధిపతి, క్షేత్ర పాలకుడైన బయలు వీరభద్రుడికి ప్రదోషకాల పూజలు శాస్ర్తోక్తంగా జరిపించారు. అనంతరం సంధ్యా సమయంలో నంది మండపంలో కొలువైన నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మాఢవీధిలో జరిగిన కళారాధన కార్యక్రమంలో కుచిపూడి నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో సంగారెడ్డికి చెందిన సుప్రియ సిస్టర్స్‌ బృందం నృత్యనివేదన చేశారు. 

ఘనంగా మల్లన్న కల్యాణం

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల కల్యాణం మా స్వామి మల్లన్న ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఎర్రగొండపాలెంలో కల్యాణం నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎర్రగొండపాలెంలో స్టేట్‌ బ్యాంక్‌ సెంటర్‌లో దేవస్థాన సహాయ కమిషనర్‌ కోదండరామిరెడ్డి పర్యవేక్షణలో ఉదయం పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. 

నేడు శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు

శ్రీశైల క్షేత్రానికి భక్తులు మొక్కుల రూపంలో చెల్లించిన హుండీ ఆదాయ లెక్కింపును బుధవారం ఉదయం ప్రారంభిస్తున్నట్లు దేవస్థాన కార్యనిర్వాహణాధికారి కేఎస్‌ రామారావు తెలిపారు. 

ఉమ్మడి పాలమూరు నుంచి 

పాదయాత్రగా..

శ్రీశైల క్షేత్రానికి ఏటా పాలమూరు జిల్లా హన్వాడ శ్రీ మఠం గురుపాదయ్య పాదయాత్ర వెళ్తున్నామని అన్నారు. శ్రీశైలం వచ్చేందుకు 250 మందికి పైగా ఒక బృందంగా ఏర్పడి పాదయాత్ర చేసుకుంటూ మంగళవారం సాయంత్రం క్షేత్రానికి చేరుకున్నట్లు తెలిపారు. ఏడు రోజులు సాగిన పాదయాత్రలో శివనామస్మరణతోపాటు భజనలు చేసుకుంటూ సహపంక్తి భోజనాల మధ్య శివతత్వాన్ని వివరిస్తూ రావడం ఆనందాన్నిచ్చిందని పలువురు అన్నారు. 33 ఏండ్లుగా స్వామి అమ్మవార్ల వద్దకు పాదయాత్రగా వస్తున్నాని గురుపాదయ్య అన్నారు. ఊరూరా హిందూ ధర్మప్రచారం చేస్తున్నామని వీహెచ్‌పీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి అన్నారు. 


logo