శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 28, 2020 , 03:55:35

బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకే..

బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకే..

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే పేదింటి బిడ్డ అయిన కల్పనకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్‌ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం అనంతరం విలేకరులతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జనరల్‌ మహిళ వచ్చినప్పటికీ బీసీకి చెందిన కల్పన రెండోసారి కౌన్సిలర్‌గా ఎన్నికైనందున చైర్‌ పర్సన్‌ పదవి ఇచ్చినట్లు చెప్పారు. నాగర్‌కర్నూల్‌ జనరల్‌ ఎమ్మెల్యేగా ఉండడం వల్ల జెడ్పీ చైర్మన్‌ పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి, మున్సిపల్‌ పాలక వర్గంలో బీసీలకు సముచిత స్థానం కల్పించేందుకు పేదింటి ఆడబిడ్డకు చైర్‌పర్సన్‌ పదవి కట్టబెట్టడం సంతోషంగా ఉందన్నారు. డబ్బులకే కాదు విశ్వసనీయత, విధేయత, పార్టీ పట్ల నమ్మకాన్ని గమనించి అధిష్టానం చైర్‌పర్సన్‌గా కల్పనను, వైస్‌ చైర్మన్‌గా భాస్కర్‌రావుకు ఇవ్వడం టీఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో నాగర్‌కర్నూల్‌ ప్రజలు ఏ నమ్మకంతో మెజార్టీ ఇచ్చారో, ఆ నమ్మకాన్ని వొమ్ము చేయకుండా అధికారాన్ని అహంతో కాకుండా సంస్కారంతో స్వీకరించి ఆదర్శ మున్సిపల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మెజార్టీ సీట్లు వచ్చేందుకు కృషి చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. logo