మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Jan 28, 2020 , 03:47:31

తప్పు చేస్తే చర్యలు తప్పవు

తప్పు చేస్తే చర్యలు తప్పవు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల్లో తప్పులు చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్‌ నోడల్‌ అధికారి వెంకటరమణ హెచ్చరించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటర్‌ పబ్లిక్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా స్థానిక బాలుర జూనియర్‌ కళాశాలలో అవగాహన కల్పించారు. ఈసందర్భంగా డీఐవో మాట్లాడుతూ 28న నైతిక విలువల విద్య, 30న పర్యావరణ విద్య పరీక్షలు ఉంటాయని, వాటికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు కాలేజీ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ఆయా తేదీల్లో పరీక్షలు నిర్వహించి, మార్కులు వెంటనే అప్‌లోడ్‌ చేయాలన్నారు. పరీక్షా సమయానికి అరగంట ముందే నియమించబడిన అధ్యాపకుని ఫోన్‌కు ఓటీపీ వస్తుందని, దాని ప్రకారం ప్రశ్నాపత్రం బోర్డు వెబ్‌సైట్‌ నుంచి ప్రింట్‌ కాపీ తీసుకొని సమయానికి ప్రయోగ పరీక్ష ప్రారంభించాలని సూచించారు. వాల్యుయేషన్‌ చేసి మార్కులు బోర్డు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు.  ప్రిన్సిపాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కోశాధికారి పాగంటి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు మాధవరావు, ప్రధాన కార్యదర్శి గోపాల్‌రావు పలు సూచనలు సలహాలు చేశారు. సమావేశంలో జిల్లా పరీక్షల నిర్వాహణ కమిటీ సభ్యులు అనసూయ, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కందూరి కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి సైదులు, ప్రిన్సిపాల్‌ రాంచంద్రారెడ్డి, అధ్యాపకులు నరసింహులు, మహమూద్‌అలీ పాల్గొన్నారు.


logo