శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 27, 2020 ,

ఆకట్టుకున్న ప్రదర్శనలు

ఆకట్టుకున్న ప్రదర్శనలు

నాగర్‌కర్నూల్‌టౌన్‌: 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం కన్నుల పండువగా జరిగాయి. గణతంత్ర వేడుకలు స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా  కలెక్టర్‌ శ్రీధర్‌ పరేడ్‌గ్రౌండ్‌కు చేరుకొగా ఎస్పీ సాయిశేఖర్‌, డీఆర్‌వో మధుసూదన్‌నాయక్‌లు పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. అనంతరం జాతీయ జెండాను  ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై ఎస్పీతో కలిసి పరేడ్‌లో పాల్గొని పోలీస్‌ అధికారులతో వందన సమర్పణం స్వీకరించారు. ఈ  జిల్లా నుంచి స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న సమరయోధులను కలెక్టర్‌తోపాటు ఎస్పీ సాయిశేఖర్‌, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతిలు స్వాతంత్ర సమరయోధులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. 

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలపై జిల్లాలోని ఆయాశాఖల ఆధ్వర్యంలో రూపొందించి ప్రదర్శించిన ప్రచార శకటాలు ఆకట్టుకున్నాయి. గ్రామీణాభివృద్ధి, వైద్యం, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, మిషన్‌ భగీరథ, ఫారెస్టు, మత్స్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమశాఖల శకటాలను ప్రదర్శించారు. రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో రెడ్‌క్రాస్‌ యూత్‌ విద్యార్థులు తాము పొందిన ప్రథమ చికిత్సపై శిక్షణను ప్రదర్శించారు. అత్యవసర సమయాల్లో ఎలాంటి చికిత్స చేయాలనే దానిపై కండ్లకు కట్టినట్లు కలెక్టర్‌, ఎస్పీ, జెడ్పీ చైర్‌పర్సన్లకు చూపించారు. వీరిలో ఉత్తమ శకటాలుగా ఎంపిక చేయగా ప్రథమ స్థానంలో గ్రామీణాభివృద్ధి, రెండవ స్థానంలో వైద్యారోగ్యశాఖ, మూడవ స్థానం  అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ శకటాలు బహుమతులు పొందాయి. వీరిని కలెక్టర్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

విద్యార్థుల నృత్య ప్రదర్శనలు..

గణతంత్ర వేడుకల్లో భాగంగా పెరేడ్‌ గ్రౌండ్‌లో జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలతో అలరించారు. జిల్లాలోని సాయిలహరీ ఆకాడమీ, చారకొండ విశ్వశాంతి పాఠశాల, వెల్దండ మోడల్‌ హైస్కూల్‌, అచ్చంపేట ట్రైబ్‌ వెల్ఫేర్‌, నాగర్‌కర్నూల్‌ గీతాంజలి, ఉయ్యాలవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే, అచ్చంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు దేశభక్తి, గ్రామీణ జానపదం పాటలకు నృ  చేశారు.    నృత్య ప్రదర్శనలు చేసిన విద్యార్థులో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు.  


logo