బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 27, 2020 ,

అభివృద్ధి పరుగులు

అభివృద్ధి పరుగులు

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : నాగర్‌కర్నూల్‌ జిల్లాలో సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు పకడ్బందీగా అలవుతున్నాయని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ తెలిపారు. ఫలితంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ స్పూర్తితో రాష్ట్రంతో పాటు జిల్లా మున్ముందుకు సాగుతుందన్నారు. జిల్లాలో రూ.120కోట్లతో 24గంటల నాణ్యమైన విద్యుత్‌ అందుతుందన్నారు. అలాగే 85,236 వ్యవసాయ బావులకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా 2,805మంది కుటుంబాలకు సాయం అందిందన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. జిల్లాలో ఎంజీకేఎల్‌ఐ, పాలమూరు, భీమా, డిండి ప్రాజెక్టుల వల్ల సాగునీరు అందించే చర్యలు విజయవంతం అవుతున్నాయన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా 1216చెరువులను మరమ్మత్తులు చేపట్టామన్నారు. ఈ ఏడాది ఎంజీకేఎల్‌ఐ ద్వారా 479చెరువులను నింపామన్నారు. ఫలితంగా జిల్లాలో 3.98లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు సాధించడం జరిగిందన్నారు. రైతుబంధు ద్వారా 2.48లక్షల మంది రైతులకు రూ.270కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయంతో పాటు కులవృత్తిదారులను ఆదుకుంటున్నట్లు తెలిపారు. గొర్రెల పంపిణీలో భాగంగా జిల్లాలో రూ.22కోట్లతో 19వేల మంది కాపర్లకు 4.01లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. అలాగే 7,714మంది ఎస్సీ,ఎస్టీ రైతులకు పాడి గేదెలు పంపిణీ చేశామన్నారు. 13వేల మంది మత్స్యకారుల కోసం 2.15కోట్ల చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో చెరువుల్లో వదిళామని, దని వల్ల ఈ ఏడాది 9,860టన్నుల చేపల ఉత్పత్తి సాధించినట్లు పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రూ.1.85కోట్లతో ఆస్పత్రుల్లో వైద్య పరికరాలు, ఫర్నీచర్‌ ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్‌ కిట్‌ ద్వారా 13వేల మంది గర్భిణీలకు రూ.12వేల చొప్పున ఆర్థిఖ సాయం అందించామన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా 4.99లక్షళ మందికి కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు అందించామన్నారు. ఇక జిల్లాలో 999కిలో మీటర్ల రోడ్లు ఉన్నాయని, 20190-20సంవత్సరంలో రూ.216.29కోట్లతో 254కిలో మీటర్ల రోడ్డు పనులను పూర్తి చేసే చర్యలు తీసుకుంటున్నామన్నారు. తరిగి పోతున్న అడవుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా చేపడుతున్న హరితహారం పథకం ద్వారా గతేడాది 2.40కోట్ల మొక్కలను నాటామన్నారు. ప్రతి పంచాయతీకి ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకున్నమన్నారు. అలాగే పల్లె ప్రగతి పథఖం ద్వారా జిల్లాలో రూ.36కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. గ్రామాల్లో పారిశుధ్యం పెంచేందుకు డంపింగ్‌ యార్డుల ఏర్పాటు, మురుగు కాల్వల నిర్వహణకై ఆదేశాలు జారీ చేశామన్నారు. నిర్లక్ష్యం వహించే అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వైకుంఠ ధామాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా సకాలంలో అనుమతులు ఇవ్వడంతో ప్రభుత్వం జిల్లాకు అవార్డు అందించడం గర్వకారణమన్నారు. ఇక శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు చర్యలు ప్రశంసనీయంగా నిలిచాయన్నారు. జిల్లాలో 2018లో 3429కేసులు నమోదు కాగా 2019లో 2781కేసులు నమోదయ్యావన్నారు. రోడ్ల ప్రమాదాల నివారణ, మహిళల భద్రతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 729సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్లన ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయన్నారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకు ముందు వివిధ శాఖల శకటాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.


logo