మంగళవారం 26 మే 2020
Nagarkurnool - Jan 27, 2020 ,

నేడే పట్టాభిషేకం

నేడే పట్టాభిషేకం

నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ మున్సిపాల్టీల్లో ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్ల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నాగర్‌కర్నూల్‌లో 24స్థానాలకు గాను టీఆర్‌ఎస్‌ 14స్థానాలను, కల్వకుర్తిలో 22స్థానాలకు టీఆర్‌ఎస్‌ 10స్థానాలతో పాటుగా నలుగురు రెబెల్స్‌తో కలిపి 14స్థానాలతో పుర పీఠాలను దక్కించుకొంది. ఇక కొల్లాపూర్‌లో 20వార్డులకు గాను 9వార్డుల్లో టీఆర్‌ఎస్‌, 11వార్డుల్లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ పేరిట స్వతంత్రులు గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి, ఎంఎల్‌సీ కూచకుళ్ల దామోదర్‌ రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు ఎక్స్‌ అఫీషియో ఓట్ల ద్వారా టీఆర్‌ఎస్‌ కొల్లాపూర్‌ పీఠాన్ని స్వంతంగా అధిష్టించబోతోంది. ఇక నాగర్‌కర్నూల్‌లో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌ రెడ్డి, కల్వకుర్తిలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇప్పటికే మున్సిపల్‌ అధికారులకు లిఖిత పూర్వకంగా లేఖలు అందించారు. ఆయా పార్టీల్లో గెలిచిన అభ్యర్థులు ఇప్పటికే క్యాంపునకు వెళ్లారు. సోమవారం మున్సిపల్‌ కేంద్రాల్లో జరిగే ప్రత్యేక సమావేశం నాటికి ఒకేసారి చేరుకోనున్నారు. ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించనున్నారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ నాగర్‌కర్నూల్‌లో జరిగే సమావేశానికి హాజరు కాబోతున్నారు. టీఆర్‌ఎస్‌ పుర పీఠాలను కైవసం చేసుకోగా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ అభ్యర్థులను పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఎంపిక చేయనున్నారు. ఇక ఆయా పార్టీల అభ్యర్థులందరికీ విప్‌ను జారీ చేశారు. ఎవరైనా ఇతర పార్టీలకు మద్దతు ఇస్తే వెంటనే సభ్యత్వం రద్దు అవుతుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపల్‌ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తును సైతం ఏర్పాటు చేయనున్నారు. నాగర్‌కర్నూల్‌లో తొలిసారిగా సొంతంగా టీఆర్‌ఎస్‌ పుర పీఠం సాధించింది. గత 2014ఎన్నికల్లో 6సీట్లు రాగా ఆ తర్వాతి పరిణామ క్రమంలో ఎంఎల్‌సీ కూచకుళ్ల దామోదర్‌ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అప్పటికే చేరిన పలువురు సభ్యులతో కలిసి టీఆర్‌ఎస్‌ కందనూలు పీఠంలో పరిపాలన చేపట్టింది. అయితే ఈ పరిణామాలు పూర్తి స్థాయి అభివృద్ధికి చేయూతనివ్వలేదు. కొల్లాపూర్‌లో నగర పాలిక, మున్సిపాల్టీగా మారాక ఇవే తొలి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్స్‌ అఫీషియో ఓట్ల ద్వా  కారు కొల్లాపూర్‌ పీఠం అధిష్టిస్తోంది. ఇక కల్వకుర్తిలో మాత్రం రెండోసారి టీఆర్‌ఎస్‌ ఛైర్మన్‌ పీఠం సాధించడం విశేషం. ఇలా మూడు పురపీఠాలను కైవసం చేసుకోవడంతో టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వచ్చిం ్బ. ఇప్పటికే జరుగుతోన్న అభివృద్ధి పనులను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ ఎన్నికలు దోహదం చేయనున్నాయి. కాగా ఛైర్మన్‌ అభ్యర్థుల  పార్టీ అధిష్టానం సూచన మేరకు ఎంపిక చేయనున్నారు. సోమవారం నాటికి పార్టీ అధిష్టానం అధికారికంగా ఛైర్మన్ల పేర్లను ఖరారు చేయనుంది. కాగా కో ఆప్షన్ల ఎంపికకు ప్రత్యేక నోటిఫికేషన్‌ జారీ కానుంది. మొత్తం మీద నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మూడు పురపాలికల్లోనూ టీఆర్‌ఎస్‌ గులాబీ జెండా ఎగురనుంది. ఫలితంగా కాబోయే కాలంలో అభివృద్ధి పరుగులు షురూ కానున్నాయి.


ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ శ్రీధర్‌

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నేడు కొత్త పాలక మండలి తొలి సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోనే మున్సి  చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, కల్వకుర్తి ఆయా మున్సిపాలిటీల కార్యాలయాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. నాగర్‌కర్నూల్‌ మున్సిపల్‌లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ పరిశీలించారు. ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంపటందని, అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు మున్సిపల్‌ చైర్మన్ల ఎన్నిక జరగనుందన్నారు. ఆ వెంటనే డిప్యూటీ వైస్‌ చైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అందరూ ప్రతిజ్ఞ నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్ల పరోక్ష ఎన్నికల్ల తమ ఓటును వినియోగించుకునేందుకు కొల్లాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యులు పోతుగంటి రాములు, నాగర్‌కర్నూల్‌ శాసన మండలి సభ్యులు దామోదర్‌రెడ్డిలు వినియోగించుకోనున్నారు.  అదేవిధంగా కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో కల్వకుర్తి శాసన సభ్యులు జైపాల్‌యాదవ్‌ తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలో నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా మున్సిపల్‌ కమిషనర్లకు ఈనెల 25వ తేదీనే దరఖాస్తులు చేసుకున్నారని కలెక్టర్‌ తెలిపారు. తొలి సమావేశానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆయా మున్సిపాలిటీ కమిసనర్లకు కలెక్టర్‌ శ్రీధర్‌ ఆదేశించారు.logo