గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 27, 2020 ,

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

ఉత్తమ పౌరులుగా ఎదగాలి

కందనూలు : విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని జిల్లా రవాణాశాఖాధికారి ఎర్రిస్వామి అన్నారు. ఆదివారం 71 గణతంత్ర దినోత్సవం సందర్భంగా  జిల్లాలోని ఆనందనిలయం వసతిగృహంలో ఏర్పాటు చేసిన జెండావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని  మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపోందించుకొని దేశ సేవ చేయాలని కోరారు. రాజ్యంగంలోని హక్కులను వినియోగించుకోవాలని కోరారు. విద్యార్థులకు విద్యనభ్యసించుటకు ఉపయోగపడే పెన్నులు, ప్యాడ్‌లు, స్కేల్లు, పెన్సిల్లు, నీటి సీసాలు తదితర వాటిని విద్యార్థులకు వితరణ చేశారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ ఎసై రాఘవేందర్‌, వసతిగృహ సంరక్షకుడు రామాంజనేయులు, రవాణా శాఖా సిబ్బంది కృష్ణ, వినోద్‌, నిరంజన్‌, డ్రైవింగ్‌ పాఠశాల నిర్వహకుడు వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

తిమ్మాజిపేట మండలంలో..

తిమ్మాజిపేట :  మండలంలో  గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద సర్పంచ్‌లు  జాతీయ జెండా ఎగరవేశారు. ఆర్‌సితండా జీపీ  వద్ద సర్పంచ్‌ గంమ్లి, గుమ్మకొండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ సత్యంయాదవ్‌, అమ్మపల్లిలో సర్పంచ్‌ లక్ష్మమ్మ, బుద్దసముద్రంలో సర్పంచ్‌ రాణెమ్మ, నేరళ్లపల్లిలో సర్పంచ్‌ నర్సింహరెడ్డి, మారేపల్లిలో సర్పంచ్‌ నాగమణి జెండా ఎగురవేశారు. అప్పాజిపల్లిలో సర్పంచ్‌ తిరుపతమ్మ, మరికల్‌లో సర్పంచ్‌ హనుమంతుయాదవ్‌, గొరిటలో సర్పంచ్‌ మురళీధర్‌రెడ్డి, చేగుంటలో సర్పంచ్‌ లావణ్య, మాన్యానాయక్‌ తండాలో సర్పంచ్‌ రమేశ్‌, తుమ్మలకుంటలో సర్పంచ్‌ హుని, లక్ష్మన్‌ నాయక్‌తండాలో సర్పంచ్‌ జమ్రులు జెండాను ఆవిష్కరించారు. అమ్మపల్లిలో ఆదర్శ యువజన సంఘం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించి, విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలో గత రెండ్రోజులుగా నిర్వహించిన ఆటలపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. మండల స్థాయి ఉత్తమ జీపీగా ఎంపిక కావడంతో ఎంపీపీ , జెడ్పీటీసీలు సర్పంచ్‌, ఎంపీటీసీలను సన్మానించారు. బావాజీపల్లిలో 71 అడుగుల జాతీయ పతకాన్ని ప్రదర్శించారు.  పాఠశాలల వద్ద విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మరికల్‌లో యువజన సంఘం సభ్యులు అంబేద్కర్‌ జీవితం పుస్తకాలను  పంపిణీ చేశారు.

బిజినేపల్లి మండలంలో..

బిజినేపల్లి : మండల కేంద్రంతో పాటు మండలంలో జెండా పండుగను ఘనంగా  నిర్వహించారు.పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై లక్ష్మీనర్సింహ , తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ అంజిరెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద మండలాధ్యక్షుడు కుర్మయ్య జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు బహుమతులు, నోట్‌ పుస్తకాలు అందజేశారు. మండలంలోని పాలెం గ్రామంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌ జెండా ఎగురవేశారు.   కార్యక్రమంలో ఎంపీడీవో హరనాథ్‌, ఎంఈవో భాస్కర్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటస్వామి, ఆయా శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

తాడూరు మండలంలో..

తాడూరు : ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఈవో కార్యాలయంలో ఎంఈవో చంద్రశేఖర్‌రెడ్డి, తాసిల్దార్‌ కార్యాలయంలో తాసిల్దార్‌ వెంకటరమణ, మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం ఈశ్వర్‌, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్సై నరేందర్‌, విండో కార్యాలయం వద్ద సీఈవో ఆంజనేయులు, ప్రభుత్వ దవాఖాన వద్ద ఆయుర్వేదిక డాక్టర్‌ శ్రీనివాసప్రసాద్‌, ఏపీజీవీబీ బ్యాంక్‌ వద్ద మేనేజర్‌లు ఎగురవేశారు.  మండలంలోని పాపగల్‌ గ్రామంలో 50 మంది విద్యార్థులకు షేక్‌ జలిల్‌ ఆహ్మద్‌ నోట్‌ పుస్తకాలను పంపిణీ చేశారు. రాందేవ్‌రెడ్డి ప్లేట్ల, దామోదర్‌రెడ్డి వాటర్‌ బాటిల్స్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీదేవి, జెడ్పీటీసీ రోహిణి, ఎంపీడీవో చంద్రశేఖర్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

తెలకపల్లి మండలంలో..

తెలకపల్లి : మండలంలో  గణతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామున ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులు గ్రామాల్లో ప్రబాత్‌భేరి  నిర్వహించారు. తాసిల్దార్‌ కార్యాలయం వద్ద తాసిల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో అజారుద్దీన్‌, పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్సై భగవంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం వద్ద హన్మంత్‌రావుతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, ఇతర సంస్థల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 


logo