శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 28, 2020 , 02:21:31

నేడే ఆఖరు

నేడే ఆఖరు
  • - సోమవారానికి 15 నామినేషన్ల ఉపసంహరణ
  • - కందనూలులో 9, కొల్లాపూర్‌లో 2, కల్వకుర్తిలో 4..
  • - నేటి మధ్యాహ్నంతో ముగియనున్న గడువు
  • - రేపు తేలనున్న బరిలోని అభ్యర్థుల జాబితా

నాగర్‌కర్నూల్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని మూడు మున్సిపాలిటీల పరిధిలో సోమవారం 9 నామినేషన్ల అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. నాగర్‌కర్నూల్‌ నుంచి రెబల్‌గా టిఆర్‌ఎస్‌ పార్టీ నుంచి రెబల్‌గా వేసిన అభ్యర్థులు 3, స్వతంత్య్ర అభ్యర్థులు 3, కాంగ్రెస్‌ నుంచి 3 నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అదేవిధంగా కొల్లాపూర్‌ మున్సిపల్‌ పరిధిలోని 19వ వార్డు నుంచి ఒకరు, 5వ వార్డు నుంచి ఒకరు స్వతంత్ర అభ్యర్థి, కల్వకుర్తి మున్సిపల్‌ పరిధిలోని కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థులు 3, స్వతంత్ర అభ్యర్థి ఒకరు చొప్పున తమ నామినేషన్లపు ఉపసంహరించుకున్నారు. దీంతో 597 నామినేషన్లు అధికారుల పరిశీలనలో ఉన్నారు. మంగళవారం ఉపసంహరణకు చివరి సమయంలో కావడంతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

బుజ్జగింపుల పనిలో..

మూడు మున్సిపాలిటీ పరిధిలోని 66 వార్డుల్లో వందలాదిగా నామినేషన్లు రావడంతో ఆయా పార్టీల ప్రతినిధులు ఖంగుతిన్నారు. అన్ని పార్టీల తరుపున అభ్యర్థులతోపాటు రెబల్‌గానూ, స్వతంత్ర అభ్యర్థులుగానూ నామినేషన్లు వేయడంతో వారిని ఉపసంహరింపజేసేందుకు ఆయా పార్టీల ప్రతినిధులు బుజ్జగింపులు చేస్తున్నారు. నేటితో సమయం ముగుస్తుండడంతో ముఖ్యంగా రెబల్‌గా వేసిన అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే ఒక్కో వార్డుకు ఓరల్‌గా 9 మంది పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.  ఇప్పటికే కొన్ని వార్డుల్లో అభ్యర్థుల ఎన్నిక సులువుగా ఉందనిపిస్తున్నా మరికొన్ని వార్డుల్లో అన్ని పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచి గట్టి పోటీని ఇవ్వనున్నారు. మంగళవారం ఉపసంహరణ అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలనున్నది.logo