గురువారం 04 జూన్ 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:13:25

మత సామరస్యానికి ప్రతీక నిరంజన్ షావలీ దర్గా

మత సామరస్యానికి ప్రతీక నిరంజన్ షావలీ దర్గా
  • పాతేహ సమర్పించి ప్రార్థన చేసిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజుజాతరకు ఇతర రాష్టాల నుంచి లక్షలాది మంది తరలొస్తారు..

అచ్చంపేట రూరల్: మండల పరిధిలోని రంగాపూర్ నిరంజన్ షావలీ దర్గా మత సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. రంగాపూర్ ఉర్సు జాతర ప్రారంభమై శుక్రవారంతో 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విప్ గువ్వల బాలరాజు పాతేహ సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రతి ఏడాది జనవరి 17 నుంచి మొదలయ్యే జాతర కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కర్నూలు మొదలైన ప్రాంతాల నుంచి లక్షలాది మంది తరలి రావడం గర్వించదగ్గ విషయమని గుర్తు చేశారు. కుల మతాలకు అతీతంగా నిరంజన్ షావలీకి పాతేహాలు సమర్పించి, ప్రార్థనలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. రంగాపూర్‌లో నిరంజన్ షావలీ, సమీపంలోని కొండ పై ఉమామహేశ్వరుడు కొలువుదీరడం ప్రాంత ప్రజల పుణ్యఫలం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉత్సవాలకు వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, ఎంపీపీ శాంతాలోక్యానాయక్, జెడ్పీటీసీ మంత్య్రానాయక్, పదర జెడ్పీటీసీ  మున్సిపల్ చైర్మన్ తులసీరాం, ధావఖాన చైర్మన్ రహమతుల్లా, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు రాజేందర్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహాగౌడ్, రైతు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు రామకృష్ణారెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, ఆంజనేయులు, పర్వతాలు, తిరుపతియాదవ్, బాల్‌రాజు, అన్వర్, అక్భర్, రమాకాంత్, శేఖర్ తదితరులు ఉన్నారు.logo