ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:12:27

కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి

కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి


నాగర్‌కర్నూల్ టౌన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను పకడ్భందీగా నిర్వహించాలని రాష్ట్ర పురపాలక సంచాలకులు డాక్టర్ టీకే.శ్రీదేవి సూచించారు. చైర్మన్ల పరోక్ష ఎన్నికలపై మున్సిపల్ కమిషనర్లతో హైదరాబాద్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు కమిషనర్లను అభినందించారు. అదేస్ఫూర్తితో 25వ తేదీన నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కమిషనర్లను ఆదేశించారు. మొదటి రౌండ్ నుంచే బ్యాలెట్ పేఏపర్‌లో కౌంటింగ్ పీవోడైరీల వివరాల ప్రకారం ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా అనే విషయాన్ని గమనించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. వార్డుల వారీగా ఫలితాలు వెల్లడించిన తర్వాత గెలుపొందిన అభ్యర్థులకు 27వ తేదీన కౌన్సిలర్‌లకు ప్రమాణ స్వీకారం, చైర్మన్ల పరోక్ష ఎన్నికల సమావేశంలో పాల్గొనేందుకు 25వ తేదీనే నోటీసులు అందజేయాలని సూచించారు. 27న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కోఅప్షన్ సభ్యుల పరోక్ష ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆయా మున్సిపాలిటీల పరిధిలో వచ్చే ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఏ మున్సిపాలిటీలో పాల్గొనేది 25వ తేదీనే మున్సిపల్ కమిషనర్లకు సమాచారం నేరుగా అందజేయాలన్నారు. 27న నిర్వహించే తమ మున్సిపాలిటీ పరోక్ష ఎన్నికల్లో పాల్గొనే ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు 25వ తేదీనే సమావేశంలో పాల్గొనేందుకు నోటీసులు అందజేయాలన్నారు. కౌంటింగ్ అనంతరం మున్సిపల్ కమిషనర్లు కార్యాలయంలో అందుబాటులో ఉండాలన్నారు. పరోక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 25వ తేదీన తెలియజేస్తారని, వారికి మున్సిపల్ కమిషనర్లు అందుబాటులో ఉండాలన్నారు.  ప్రత్యక్ష ఎన్నికల సమావేశంలో మీడియాకు అనుమతి లేదన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నాగర్‌కర్నూల్ మున్సిపల్ కమిషనర్ జయంత్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ సిబ్బంది ప్రసాద్, ప్రశాంత్‌గౌడ్, మహేశ్, తదితరులు పాల్గొన్నారు.logo