గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 25, 2020 , 01:10:44

కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి పొందాలి

కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి పొందాలి


కల్వకుర్తి రూరల్  : మహిళలు సత్యసాయి సేవా సమితి ట్రస్టు ద్వారా కుట్టు శిక్షణతో స్వయం ఉపాధి పొందాలని  బీఐఆర్‌ఈడీ సంస్థల అసిస్టెంట్ డైరక్టర్ రవీందర్, సత్యసాయి సేవా సమితి ఉమ్మడి పాలమూరు జిల్లా కన్వీనర్ ఈశ్వరయ్య పేర్కొన్నారు. శుక్రవారం కల్వకుర్తి పట్టణంలోని  షిరిడీసాయి, సత్యసాయి ప్రశాంతి సన్నిధిలో బీఐఆర్‌ఈడీ రాజేంద్రనగర్ వారి సహకారంతో సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులలో శిక్షణ  ప్రారంభమైంది.  ఈ కార్యక్రమానికి బీఐఆర్‌ఈడీ సంస్థల అసిస్టెంట్ డైరక్టర్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ    శిక్షణకు ఎంపికైన వారికి కోర్సు పూర్తయ్యే వరకు ఉచితంగా భోజన వసతితో పాటు స్నాక్స్‌లను అందిస్తున్నారని శిక్షణానంతరం వారికి సర్టిఫికెట్లను అందజేస్తామన్నారు. శిక్షణ పొందిన మహిళలు, యువతులు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని కోరారు.  కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి ట్రస్టు జిల్లాధ్యక్షుడు శంకరయ్య, కల్వకుర్తి ట్రస్టు చైర్మన్ కూన చంద్రశేఖర్, కన్వీనర్ లక్ష్మణ్‌బాపూ, విష్ణువర్ధన్‌రావు, కృష్ణకుమార్, నివేదిత, సుధా, శిక్షకురాలు సుమలత  పాల్గొన్నారు.logo