ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Jan 23, 2020 , 03:01:46

పోటెత్తిన ఓటరు

పోటెత్తిన ఓటరు


జిల్లాలో 79.32శాతం పోలింగ్

నాగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: నాగర్ జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. జిల్లాలోని నాగర్ కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 66వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. మూడు పట్టణాల్లోని 132పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అధికార టీఆర్ పాటు కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి 280మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం ఆయా పార్టీలతో పాటుగా అభ్యర్థులూ పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటుగా మందు, విందు, డబ్బులతో ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేపట్టారు.

పోలింగ్ నమోదు ఇలా..

జిల్లాలో 73వేల మంది ఓటర్లకు గాను 79.32శాతంతో 58వేల మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. ఇలా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. కొల్లాపూర్ అత్యధికంగా 81.37శాతం పోలింగ్ నమోదు కాగా కల్వకుర్తిలో 81.37శాతం పోలింగ్, అత్యల్పంగా నాగర్ 76.89శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మూడు మున్సిపాల్టీల్లోనూ ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలకే ముగిసింది. మధ్యాహ్నం 2గంటల వరకే దాదాపుగా సగానిపైగా పోలింగ్ జరిగింది. కల్వకుర్తిలో 68.65శాతం, కొల్లాపూర్ 69.44శాతం, నాగర్ 65.39శాతం నమోదు కావడం గమనార్హం. ఆయా వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆటోలను ఏర్పాటు చేయించి మహిళలు, వృద్ధులను పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చారు.

దీంతో పోలింగ్ మధ్యాహ్నం వరకే పెద్ద ఎత్తున జరిగింది. నాగర్ మున్సిపాలిటీ 1వ వార్డు(ఎండబెట్ల)లో అత్యధికంగా 94.52శాతం పోలింగ్ నమోదు కాగా కొల్లాపూర్ 15వ వార్డులో 92.77శాతం పోలింగ్ జరిగితే అతి తక్కువగా నాగర్ 20వ వార్డులో 62.88శాతం పోలింగ్ జరిగింది.  దాదాపు ప్రతి వార్డులోనూ 60శాతంపైగా పోలింగ్ జరగడం విశేషం. ఇక కొల్లాపూర్ తొలిసారి ఎన్నికలు జరిగితే నాగర్ కల్వకుర్తిలో రెండోసారి నగర పంచాయతీ నుంచి, పురపాలికలుగా మారిన తర్వాత రెండోసారి జరుగుతున్నాయి. 2014లో తొలిసారిగా నాగర్ 20వార్డులుండగా ఈసారి నాలుగు గ్రామాలు విలీనం కావడంతో పోలింగ్ 7శాతానికిపైగా చేరుకొంది.

అదే కల్వకుర్తిలోనూ రెండు గ్రామాలు చేరికతో 2014లో 77శాతంగా ఉన్న పోలింగ్ ఈసారి 3శాతం పెరిగింది. మహిళలు, వృద్ధులు, యువకులు సైతం పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా చేరుకొన్నారు. ఇదిలా ఉంటే అధికారులు సైతం ఎన్నికలు విజయవంతం చేసేందుకు తీసుకున్న చర్యలు ఫలితాలను ఇచ్చాయి. మూడు మున్సిపాలిటీల్లోనూ 62సమస్యాత్మక కేంద్రాలు ఉండగా ఎక్కడా ఎలాంటి ఘర్షణలు జరగలేదు. జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు పౌసమిబసు,  కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ పలు కేంద్రాల్లో ఎన్నికల తీరును పర్యవేక్షించారు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కొల్లాపూర్ జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి నాగర్ 12వ వార్డులో, 21వ వార్డులో సీపీవో మోహన్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకొన్నారు. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి.

బ్యాలెట్ బాక్సుల్లో..

పోలింగ్ పూర్తయ్యాక మూడు మున్సిపాలిటీ పోలింగ్ బూత్ నుంచి బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రాలకు పోలీసు బందోబస్తు మధ్యన తరలించారు. నాగర్ 24వార్డుల బాక్సులను లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ కొల్లాపూర్ 20వార్డుల బాక్సులను పీజీ కళాశాలకు, కల్వకుర్తి 22వార్డుల బాక్సులను మల్లిఖార్జున బీఈడీ కళాశాలలకు చేరవేశారు. ఈనెల 25న లెక్కింపు చేపట్టి ఆ వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ఈ విధంగా రెండు వారాలుగా జరిగిన ఎన్నికలు ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఉత్కంఠ ముగిసింది. ఓటింగ్ సరళిని, తమకు జరిగిన లాభనష్టాలను బేరీజు వేసుకొంటున్నారు. శనివారం ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు చూపంతా ఆరోజువైపు సారించారు. అధికారులు సైతం ఎన్నికలు ప్రశాంతంగా పూర్తవడంతో ఊపిరి పీల్చుకొన్నారు. ఈనెల 25వ తేదీన వెలువడే ఫలితాలపై ప్రజలు తమకు తోచిన అంచనాలతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.logo