ఆదివారం 31 మే 2020
Nagarkurnool - Jan 23, 2020 , 03:01:10

ఓటింగ్ సరళిని పరిశీలించిన పౌసమిబసు

ఓటింగ్ సరళిని పరిశీలించిన పౌసమిబసు


కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలు బుధవారం జరిగిన నేపథ్యంలో పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ గాంధీ స్మారకోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఉదయం 10:20గంటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన పరిశీలకురాలు పౌసమిబసు పరిశీలించారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 13,16,17,20 వార్డులకు సంబంధించిన పోలింగ్ 25, 26, 31, 32, 33, 34, 39, 34లను సందర్శించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో నమోదు అయిన ఓటర్ల వివరాలు, ఓటింగ్ సరళిని ఆమె అడిగి తెలుసుకున్నారు.

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అనంతరం పౌసమిబసు, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితోనూ, స్థానిక ఆర్డీవో శ్రీరాం, కమిషనర్ వెంకటయ్యతో పోలింగ్ జరుగుతున్న తీరును గూర్చి అడిగి తెలుసుకున్నారు. ఉదయం 12గంటలకు కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలు 25,26,31,32లను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నమోదు తీరును గూర్చి పోలింగ్ అధికారులతో వివరాలు అడిగితెలుసుకున్నారు.logo