శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 23, 2020 , 02:58:47

భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో..

భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో..


మహబూబ్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఉమ్మడి జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ క్రమంలో 25వ తేదీన జరిగే కౌంటింగ్ అంద రి చూపు ఉన్నది. గెలుపు గుర్రాలెవరో శనివారం తేలిపోనున్నది. ఎవరు గెలుస్తారో..? ఎవరు ఓడతారో..? తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు ఇదే అంశంపై బెట్టింగ్ రాయుళ్లు సైతం బరిలో దిగినట్లు సమాచారం. రూ.వేల నుంచి లక్షల వరకు పందేలు కాస్తున్నారని తెలుస్తున్నది. మరోవైపు కీలకమైన వార్డుల్లో చైర్మన్ అభ్యర్థులుగా భావిస్తున్న వారిని ఓడించేందుకు సైతం ప్రయత్నాలు జరిగాయని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి వార్డుల్లో బెట్టింగ్ జో రుగా సాగుతోందని సమాచారం. ఎవరు గెలుస్తారనే అంశంపై మరో 2 రోజుల పాటు ఉత్కంఠ నెలకొననున్నది. అభ్యర్థుల భవితవ్యం మాత్రం స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది.

కొనసాగుతున్న ఉత్కంఠ..

17 మున్సిపాలిటీల్లో అత్యధికంగా మహబూ బ్ నగర్ 48 వార్డులకు పోలింగ్ జరగగా.. అ త్యల్పంగా అలంపూర్, వడ్డేపల్లి, ఆత్మకూరు, అమరచింత, భూత్పూర్ 10 వార్డుల చొప్పున పోలింగ్ జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 338 వార్డులకు గాను నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. వనపర్తి, మహబూబ్ ఆలంపూర్, కోస్గి ము న్సిపాలిటీల్లో ఒక్కో వార్డు చొప్పున టీఆర్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్, బీజే పీ చాలా చోట్ల అభ్యర్థులనే పోటీ పెట్టలేకపోయా రు. టీఆర్ 333, కాంగ్రెస్ 291, బీజేపీ 283 మంది పోటీ చేశారు. పలు చోట్ల ఫార్వర్డ్ బ్లాక్ పా ర్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. టీఆర్ మాత్రం ఒక్క వార్డు మినహా అన్నింటికి పోటీ చే స్తోంది. అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి, ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వరుసగా సాధించిన విజయాల మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ వి జయం సాధిస్తామని టీఆర్ నేతలు ధీమా వ్య క్తం చేస్తున్నారు. ఈసారైనా తమకు అవకాశం లభిస్తుందని ప్రతిపక్షాలు ఆశాభావంతో ఉన్నాయి.
 

జోరుగా పందేలు..

పోలింగ్ ముగిసిన వెంటనే పందెం రాయుళ్లు రంగంలోకి దిగారు. ఎవరు ఎక్కడ ఎలా విజ యం సాధిస్తారో అంచనా వేస్తూ పందేలు కడుతున్నారు. ముఖ్యంగా హోరాహోరీ పోరు సాగిన చోట బెట్టింగ్ ఎక్కువగా సాగుతోంది. అయిజ, అలంపూర్, వడ్డేపల్లి, మక్తల్, నారాయణపేట, కొ ల్లాపూర్, భూత్పూర్ మున్సిపాలిటీల్లో బెట్టింగ్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం బెట్టింగ్ వేస్తున్నట్లు స మాచారం. పలు చోట్ల చైర్మన్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఆయా పార్టీలకు చెందిన చైర్మ న్ ఆశావహులు సదరు ప్రకటిత చైర్మన్లను అభ్యర్థిని ఓడించేందుకు తెరచాటు మంత్రాంగాలు చేసినట్లు అక్కడక్కడ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చోట్ల బెట్టింగ్ బంగార్రాజులు తమ మెదడుకు పదును పెడుతున్నారు. గతంలో ఇలాగే బెట్టింగ్ వేసి రూ.25 లక్షలు సంపాదించిన ఓ పార్టీ నేత ఈసారి కూడా రంగంలోకి దిగినట్లు సమచారం. పలు చోట్ల గెలుపు ఓటముల పైనే బెట్టింగ్ వేస్తుండగా.. ఇంకొన్ని చోట్ల మెజార్టీపై కూడా పందేలు కాస్తున్నారని తెలుస్తోంది. పలువురు ఎన్నికల ప్రక్రియను మొదటి నుంచి అనుసరిస్తూ.. బెట్టింగ్ కోసం ఓ పక్కా ప్రణాళికలు కూడా రూపొందించుకున్నారని సమాచారం.

దేవుడా గెలిపించు..!

మున్సిపల్ ఎన్నికల కోసం అనేక ఏళ్లుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులు పోలింగ్ ముగిసిన తర్వా త తమ గెలుపు భారాన్ని ఇష్టదైవాలపై వేస్తున్నా రు. దేవుడా ఎలాగైనా గెలిపించు..! నీ కొలువుకు వచ్చి మొక్కు చెల్లించుకుంటానని ప్రార్థిస్తున్నారు. ఎంతో కష్టపడి ఎన్నికల బరిలో నిలిచిన తమకు విజయం దక్కాలని కోరుకుంటున్నారు. ఆస్తులు అమ్మి ఎన్నికల బరిలో నిలిచిన పలువురు అభ్యర్థులకు ఈ ఎన్నిక జీవన్మరణ సమస్యగా మారిం ది. చాలా మంది రాజకీయ జీవితంపై ప్రభావం చూపించే ఎన్నికలుగా భావిస్తున్నారు.
అందుకే ఎలాగైనా తామే గెలవాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఉత్కంఠ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.

24 ఏళ్ల తర్వాత ఓటేశా..

ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాను. ఈ క్రమంలో 24 ఏళ్లుగా ఓటేసే అవకాశం రాలేదు. ఇప్పుడు పుర ఎన్నికల్లో ఓటు వేయడం సంతోషంగా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి.
- శ్రీనివాసులు, ఆర్మీ ఉద్యోగి, మహబూబ్

నిత్యం అందుబాటులో ఉండాలి

మున్సిపాలిటీల్లో  గెలిచిన నాయకులు అభివృద్ధి కోసం పాటుపడాలి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి. గత 50 ఏళ్ల నుంచి ఓటు వేస్తున్నాను.
- పండరినాథ్, 40వ వార్డు, మహబూబ్

పరీక్ష ఉన్నా ఓటేశా..

ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో అమూల్యమైందని గుర్తించి ఎంబీబీఎస్ ఫైనలియర్ పరీక్ష ఉన్నా ఓటేసేందుకు వచ్చాను. యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం సక్రమంగా సాగుతుంది. మంచి వ్యక్తులను చూసి ఓటు వేయాలి.
- ప్రణీత గుప్త, శ్రీనివాస కాలనీ, మహబూబ్

మొదటిసారి ఓటేశా..

మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి ఓ టేయడం సంతోషం గా ఉంది. కౌన్సిలర్లుగా గెలిచిన వారు  వార్డు అభివృద్ధికి కృషి చేస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి. అప్పుడే వేసిన ఓటుకు విలువ ఉంటుంది.
- ఎ.శ్రావణి, బీటెక్, బీకేరెడ్డి కాలనీ, మహబూబ్

ప్రతి ఒక్కరూ ఓటేయాలి..

మంచి వ్యక్తిని ప్రజలు ఎన్నుకునేందుకు తమ అమూల్యమైన ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకులు ప్రజా సమస్యలను పరిష్కరించాలి. వార్డుల అభివృద్ధికి పాటు పడాలి.
- ఉమర్, ఎస్ వైద్య విద్యార్థి, మహబూబ్

ఓటు ఎంతో విలువైంది..

మంచి నాయకులను ఎన్నుకోవాలనే భారత రాజ్యాంగం ఓటు హక్కును కల్పించింది. ఆ ఓటు హక్కు ఎంతో ఉన్నతమైంది.. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం గర్వంగా ఉంది.
- అనూష, శ్రీనివాస కాలనీ, మహబూబ్


logo