శనివారం 30 మే 2020
Nagarkurnool - Jan 22, 2020 , 05:12:24

నేడే పుర 'పోలింగ్'

నేడే పుర 'పోలింగ్'నాగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాలోని కల్వకుర్తి, నాగర్ కొల్లాపూర్ మున్సిపాలిటీలకు బుధవారం ఎన్నికలు జరగబోతున్నాయి. మూడు మున్సిపాలిటీ పరిధిలో 66వార్డులకుగాను 280మంది అభ్యర్థులు ఆయా పార్టీల తరపున పోటీలో నిలిచారు. జిల్లాలోని 78,243మంది ఓటర్లు తమ తీర్పును ఓటు ద్వారా ఇవ్వనున్నారు. ఎన్నికల కోసం గత వారం రోజులుగా టీఆర్ కాంగ్రెస్, బీజేపీలు, స్వతంత్రులు ఉధృత ప్రచారం నిర్వహించారు. చివరగా బుధవారం నాడు ఓటింగ్ కోసం ఉత్కంఠగా ఉన్నారు.

ఏయే కులాలు, సంఘాలు ఓట్లు తమకు అనుకూలమో, ప్రతికూలమో ఓ అంచనాకు వచ్చాయి. మందు, విందు, డబ్బులతో ఓటర్లను మచ్చిక చేసుకునేలా ప్రచారం నిర్వహించారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు దాదాపుగా పూర్తి చేశారు. నాగర్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్, కొల్లాపూర్ పీజీ కళాశాల, కల్వకుర్తి భ్రమరాంబ మల్లిఖార్జున బీఈడీ కళాశాలల నుంచి ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు సామగ్రిని పంపిణీ చేశారు. ఎన్నికల నిర్వహణలో 950మంది ఉద్యోగులు భాగం కానున్నారు. ఇక గట్టి పోలీసు బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. దీనికోసం 1050మంది బలగాలను అందుబాటులో ఉంచారు. వార్డుకు రెండు చొప్పున మొత్తం 132పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 62సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి భద్రత ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు.

దీనికోసం 13రూట్ మోబైల్ 8బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే నాగర్ 24కేంద్రాల్లో, కల్వకుర్తిలో 18కేంద్రాల్లో, కొల్లాపూర్ 20పోలింగ్ కేంద్రాల చొప్పున మొత్తం 62పోలింగ్ కేంద్రాల్లో వెబ్ అమర్చారు. అలాగే 32కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. మూడు మున్సిపాలిటీలను మూడు రూట్లుగా విభజించి 13మంది జోనల్ అధికారులను నియమించారు. ప్రతి జోనల్ అధికారి 10పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణ చేపడతారు. ఇక జిల్లా స్థాయిలో 20మంది జిల్లా అధికారులు, ముగ్గురు ఆర్డీవోలు, డీఎస్పీలు, 8మంది తాసిల్దార్లు, ఆరు మంది సీఐలు ఎన్నికల ప్రక్రియను మున్సిపాలిటీల వారీగా నిర్వహిస్తారు. మూడు మున్సిపాలిటీల కమిషనర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు.

మూడు మున్సిపాల్టీల్లో దాదాపు 50శాతం లైవ్ టెలికాస్ట్ ద్వారా పోలింగ్ కలెక్టరేట్ కమాండ్ కేంట్రోల్ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు. ఎన్నికలతో మూడు పట్టణ కేంద్రాల్లో కలెక్టర్ సెలవులను ప్రకటించారు. ఇతర ప్రాంతాల్లోని ఉద్యోగులు మాత్రం ఓటు హక్కును వినియోగించుకొని విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక కార్మికులకు మాత్రం సెలవు ఇచ్చారు. అన్ని రకాల వ్యాపార,వాణిజ్య సముదాయాలు మూసి ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 5గంటలతో ముగుస్తుంది. బ్యాలెట్ పేపర్ల పద్ధతిలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో పోలింగ్ బాక్సులను పోలింగ్ పూర్తయ్యాక మూడు మున్సిపల్ కేంద్రాల్లోని సామగ్రి పంపిణీ కేంద్రాలకు చేరుస్తారు.

ఈనెల 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. దీనికోసం ఇప్పటికే సిబ్బంది నియామకం, ఇతర ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయగా రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది. అధికార టీఆర్ మాత్రం ఓటర్లను ఆకట్టుకోగా మూడు మున్సిపాల్టీలను కైవసం చేసుకుంటామనే ధీమాలో నాయకులు, అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీలాంటి ప్రతిపక్షాలకు మాత్రం గుబులు రేకెత్తిస్తోంది. ఈ ఉత్కంఠ, ఆందోళన, గుబులును తీర్చేలా ఓటర్లు బుధవారం తీర్పు ఇవ్వబోతుండగా ప్రజలు, రాజకీయ వర్గాల్లో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది.logo