బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 22, 2020 , 05:10:02

జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ

జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ


కొల్లాపూర్, నమస్తేతెలంగాణ: మండలంలోని ఎల్లూరులో సర్పంచ్ బండి లక్ష్మీదేవమ్మ ఆధ్వర్యంలో మంగళవారం గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను మండల పశు వైద్యాధికారి డాక్టర్ వరలక్ష్మీ వేశారు.నట్టల నివారణ మందులను గొర్రెలు, మేకల యజమానులు సద్వినియోగం చేసుకోవా లని ఆమె సూచించారు.

పెద్దకొత్తపల్లిలో..

పెద్దకొత్తపల్లి: మండల పరిధిలోని పెద్దకారుపాముల , మరికల్ గ్రామాల్లో పశువైద్యాధికారి మదు ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గొర్రెలు, మేకలకు రోగనివారణపై కాపరులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది యాదగిరి, సలీం తదితరులు పాల్గొన్నారు.

పాన్

పాన్ మండలంలోని తెల్లరాళ్లపల్లి,చిక్కేపల్లి గ్రామాలలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో మంగళవారం గొ ర్రెలు, మేకలకు  నట్టల నివారణ మందులను సర్పంచులు రేణ మ్మ, బాలస్వామి,పశువైద్యాధికారి శ్యామ్ పంపిణీ చేశారు.

కోడేరులో..

కోడేరు: మండలంలోని రేకులపల్లితండాలో మంగళవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో వి డత నట్టల నివారణలో భాగంగా సర్పంచ్ లాల్  గొ ర్రెలకు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు వేశా రు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న కార్యక్రమా న్ని కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ రజిత, ఎస్ చైర్మన్ జానకిరామ్, గోపాలమిత్ర కర్ణాకర్ పాల్గొన్నారు.

పెంట్లవెల్లిలో..

పెంట్లవెల్లి: పశువైద్యాశాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొండూరు, తడకలవారి తండా గ్రామా ల్లో మంగళవారం పశువైద్య సిబ్బంది జీవాలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు.  కా ర్యక్రమంలో పశువైద్యసిబ్బంది వెంకటేశ్, సూరిబాబు తదితరులు ఉన్నారు.

వీపనగండ్లలో..

వీపనగండ్ల: గొర్రెల కాపారులు పశువైద్యుల సూచన మేరకే మందులను వాడాలని జిల్లా పశుసంవర్ధక  శాఖాధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కల్వరాలలో నిర్వహిస్తున్న గొర్రెలు, మేకల నట్టల నివారణ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలో నిర్వహిస్తున్న నట్టలనివారణ కార్యక్రమం వివరాలను స్థానిక పశువై ద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నా రు. నరసింహరెడ్డి, గొర్రెల పెంపకం దారుల సహకార సం ఘం అధ్యక్షుడు  రాముడు, సత్యం, మధుసూదన్, శివాజీ, కాపరులు నరసింహ, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.logo