గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 21, 2020 , 02:11:43

సింహాలను అడవికే పంపండి

సింహాలను అడవికే పంపండి


కొల్లాపూర్‌, నమస్తేతెలంగాణ:  మరింత సమగ్ర అభివృద్ధి చే సుకునేందుకు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి ని రంజన్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొల్లాపూర్‌ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం సోమవారం మధ్యాహ్నం పట్టణంలో  పార్టీ శ్రేణులతో నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి చాడ కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డినరేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న మను షుల మద్య పులులు, కుక్కలు, సింహాలకు అవకా శం ఇవ్వ కండని, సింహాన్ని అడవికి పంపేయాలని మంత్రి ఓటర్లకు హి తవు చెప్పారు.

ఈ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కారుగుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసుకునేందుకు ఆవకాశం ఉంటుందని, విజ్ఞులైన ఓటర్లు ఆలోచించాలని మం త్రి అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మరో నాల్గు ఏళ్ల వరకు ఉం టుందని, ప్రతి గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ టీఆర్‌ఎస్‌ పార్టీవారే కనుక ఏ పనులు కావాలన్న చేసేది సీఎం కేసీఆరేనన్నారు. కొల్లాపూర్‌ ఓటర్లు విజ్ఞులని, అందుకోసం ఓటర్లు అభివృద్ధి చేసే గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు మంత్రి నిరంజన్‌రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఏ అభివృద్ధి చేయాలన్న టీఆర్‌ఎస్‌కే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.  కేసీఆర్‌ ఆశీస్సులతో కొల్లాపూర్‌ అభివృద్ధికి ఎమ్మెల్యే బీరంతో కలిసి కృషిచేస్తాని మంత్రి స్పష్టం చేశారు.  ప్రతి ఒక్కరూ పార్టీకి కట్టుబడి ఉండాలని కేసీఆర్‌, కేటీఆర్‌ స్పష్టంగా చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.

మాయమాటలకు మోసపోవద్దు: ఎమ్మెల్యే బీరం

ఈ ఎన్నికల్లో కొందరు అబద్దాలు, మాయమాటలు చెప్పే వా రి మాటలకు మోసపోవద్దని ఎమ్మెల్యే బీరం ఓటర్లకు పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌ పట్టణం అభివృద్ధికి నిధులిస్తే నాసిర కం సీసీరోడ్లు వేస్తే వాటిపై తాను ఫిర్యాదు చేస్తే ఆ రోడ్లపై ఇప్పు డు మళ్లీ సీసీరోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని ఆయన చె ప్పారు. గతంలో వేసిన సీసీరోడ్లు, నేను ఎమ్మెల్యే అయ్యాక నిర్మాణం చేసిన సీసీ రోడ్లను ఒక్కసారి నాణ్యతను పరిశీలించండని ఆయన పేర్కొన్నారు. కొల్లాపూర్‌ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తాను కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వంలో చేరినట్లు చెప్పారు.

టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం:  రాష్ట్ర కార్యదర్శి

కొల్లాపూర్‌ మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగురడం ఖాయమని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్‌ ఎన్నికల ఇన్‌చార్జి చాడ కిషన్‌రెడ్డి  దీమా వ్యక్తం చేశారు. ఇక్కడి సభకు వచ్చిన జనసమూహామే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఆయన చెప్పారు. మీరందరూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కారుగుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.  టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గున్‌రెడ్డినరేందర్‌రెడ్డి, జెడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు మతీన్‌ఆహ్మద్‌, నాయకులు దూరెడ్డి రఘువర్ధన్‌రెడ్డి, నడింపల్లి మహేశ్వర్‌రెడ్డి, జంబులయ్య, చంద్రశేఖరాచారి. మూలే కేశవులు, బిజ్జ వేణు, ఖాదర్‌, రామచందర్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.logo