సోమవారం 01 జూన్ 2020
Nagarkurnool - Jan 21, 2020 , 02:10:18

గెలుపు టీఆర్‌ఎస్‌ వైపే..

గెలుపు టీఆర్‌ఎస్‌ వైపే..


నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకుంటారని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం చివరి రోజు కావడంతో మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో అభ్యర్థులను వెంటపెట్టుకొని ప్ర చా రం నిర్వహించారు. మరోవైపు ఎమ్మెల్యే సతీమణి మర్రి జమునారెడ్డి సైతం అభ్యర్థుల గెలుపుకోసం ముమ్మరం ప్రచారం నిర్వహించారు. 11, 14, 15, 18 వార్డుల్లో సుమలత, ఖాజాఖాన్‌, ఇసాక్‌, జంగిరెడ్డిలను గెలిపించాలని కోరారు. 14 వార్డులోని పలువురు ముస్లిం ఇళ్లకు వెళ్లి ఓట్లను అభ్యర్థించా రు. ప్రచారంలో భాగంగా ఓ టీస్టాల్‌ వద్ద ఎమ్మెల్యే మర్రి టీ తాగారు. అధికారంలో టిఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నందున పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధి చేసుకోవడం సులభమవుతుందన్నారు.

రోడ్‌షోతో పట్టణం గులాబీమయం

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముగింపు రోజు కావడంతో ఎమ్మెల్యే మర్రి జ నార్దన్‌రెడ్డి అధ్యక్షతన నాగర్‌కర్నూల్‌ పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోకు మంచి ఆదరణ లభించింది. ప్రధాన రహదారి అంతా గు లాబీమయమైంది. సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. బస్టాండ్‌ కూడలిలో ఏర్పా టు చేసిన రోడ్‌షోలో ఎంపీ పోతుగంటి రా ములు, ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్యే మర్రి, సతీమణి మర్రి జమునారెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మున్సిపల్‌లో చేసిన, చేపట్టాల్సిన అభివృద్ధిని తెలియజేస్తూ అభివృద్ధిని తమ భుజాలపై వేసుకొని పనిచేస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ బలపరిచిన 24 వార్డులకు చెందిన అభ్యర్థులను పరిచయం చేస్తూ వీరిని గెలిపించుకునే బాధ్యత మనపై ఉందని, అప్పుడే ము న్సిపల్‌ అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తు తం జరుగుతున్న అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పూర్త యి అన్ని వీధుల్లో సీసీ రోడ్డు వేయాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపు ముఖ్యమన్నారు. మున్సిపల్‌లో విలీనమైన గ్రామాలతోపాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి పరుచుకోవచ్చన్నారు. అధికారంలో లేని వారు ఒక్కరు గెలిచినా ఫలితం లేదని, వారి మాటలకు మోసపోవద్దని, టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను గెలిపించి మున్సిపల్‌లో గులాబీ జెండా ఎగరేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈరోడ్‌షోలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఈశ్వర్‌రెడ్డి, ము న్సిపల్‌ చైర్మన్‌ మోహన్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo