గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 20, 2020 , 02:03:54

మున్సిపల్‌ అభివృద్ధికి పట్టం కట్టండి

మున్సిపల్‌ అభివృద్ధికి పట్టం కట్టండి


నాగర్‌కర్నూల్‌ టౌన్‌: నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, అప్పుడే ఐదేండ్లలో మరింత అభివృద్ధి పరుచుకునేందుకు సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఓటర్లను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపల్‌ పరిధిలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యేతో  సతీమణి మర్రి జమునారెడ్డిలు టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పట్టణంలో నాణ్యతతో కూడిన విద్యుత్‌ అందిస్తామని, అవసరమైన పీడర్లు, కొత్తగా ఏర్పడిన కాలనీలో కరెంటు సౌకర్యం, మున్సిపల్‌ పరిధిలోని గ్రామాలైన నాగనూలు, నెల్లికొండ, దేశిటిక్యాల, ఎండబెట్ల, ఉయ్యాలవాడ గ్రామాల్లో మెరుగైన విద్యుత్‌ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు.  అభివృద్ధి పనులు చేపట్టేందుకు టీఆర్‌ఎస్‌ పార్టీ పట్టం కడితేనే సాధ్యమవుతుందని, ఐదేండ్లలో తాము మేనిఫెస్టోలో తెలిపిన విధంగా అభివృద్ధి చేసి తీరుతామని ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్లు వస్తున్నాయా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.


logo