శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 19, 2020 , 01:37:30

భక్తి పారవశ్యం

భక్తి పారవశ్యం
  • - వైభవంగా లక్ష్మీనృసింహుడి రథోత్సవం
  • - గోవిందనామస్మరణతో మార్మోగిన సింగవట్నం
  • - ఉమామహేశ్వరంలో భక్తుల ప్రత్యేక పూజలు


సింగవట్నం జనసంద్రమైంది. లక్ష్మీనృసింహుని రథోత్సవం శనివారం కన్నుల పండువగా సాగింది. ఆలయ ప్రాంగణం గోవిందనామస్మరణతో మార్మోగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో, కళాకారుల నృత్య విన్యాలు, కోలాటాలతో కళకళలాడింది. రథాన్ని లాగేందుకు భక్తులు పోటాపడ్డారు. అచ్చంపేట ఉమామహేశ్వరంలోనూ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగాయి. స్వామి వారికి నందివాహనసేవ నిర్వహించారు. నల్లమల గిరిలు శివనామస్మరణతో మార్మోగాయి.

కొల్లాపూర్‌, నమస్తే తెలంగాణ : దక్షిణ తెలంగా ణలో సింగవట్నం రెండో యాదగిరిగుట్టగా ప్రాచూ ర్యం పొందిన లక్ష్మీ నర్సింహ్మ స్వామి బ్రహ్మోత్స వాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్స వాల్లో భాగంగా నాలుగో రోజు శనివారం సాయంత్రం జరిగిన స్వామివారి రథోత్సవానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తజనంతో జాతర మైదానం జన జాతరగా మారింది. భక్తజనం సందోహం మధ్య రథోత్సవం మంగళ వాయిద్యాలు, డోలు డప్పుల మోత మధ్య ఉత్సాహంగా సాగింది. బ్రాహ్మణుల వేదమంత్రోచ్ఛాణాలతో స్వామివారి రథోత్సవాన్ని పూర్ణకుంభంతో పూజించారు. భక్తుల గోవింద నామస్మరణలతో జారమైదానం మార్మోగింది. రాష్ట్రంతో పాటు రాయలసీమ ప్రాంతం నుంచి భక్తులు రథోత్సవాన్ని వీక్షించేందుకు ప్రత్యేక వాహనాల్లో రావడంతో రహదారులు కిక్కిరిశాయి. భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

పుష్కరిణిలో  స్నానాలు ఆచరించి స్వామివారితో పాటు రత్నగిరికొండపై వెలిసిన రత్నలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా ఎస్వీకేకేబీ ఆదిత్య లక్ష్మారావుతో పాటు ఆయన తనయుడు సురభి రాజా గోపాల్‌రావు, ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు మామిళ్లపల్లి విష్ణువర్దన్‌రెడ్డి, అన్ని రాజకీయ పార్టీల నాయకులు రథోత్సవం అగ్రభాగాన నిడిచారు. రథోత్సవాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ఆలయం నుంచి రథోత్సవం ప్రారంభమై రత్నగిరికొండ దిగువన ఉన్న శమీవృక్షం చుట్టూ తిరిగి యథాస్థలానికి చేరుకుంది.నాగర్‌కర్నూల్‌ డీఎస్పీ పర్యవేక్షణలో స్థానిక సీఐ వెంకట్‌రెడ్డి, సర్కిల్‌ పరిధిలోని ఎస్సైలు, పోలీస్‌ కానిస్టేబుల్‌  కాకుండా బయటి నుంచి పోలీసులు బందోబస్తు నిర్వహించారు. జాతరలో వైద్య శిబిరం, పోలీస్‌ ఔట్‌పోస్ట్‌, మత్స్య, అగ్నిమాపక, ఎక్సైజ్‌, రెవెన్యూ శాఖల ఉద్యోగులు విధుల్లో ఉన్నారు.logo