శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 18, 2020 , 03:42:32

కొల్లాపూర్‌ కోట కారుదే..

కొల్లాపూర్‌ కోట కారుదే..


నాగర్‌కర్నూల్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కొల్లాపూర్‌ కోటపై గులాబీ జెండా గుబాళించబోతోంది. తొలిసారిగా జరుగుతున్న పురపాలిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా ప్రచార సరళి సాగుతోంది. ఇక టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కా ర్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించడంతో గెలుపుకై ఎ మ్మెల్యే బీరం హర్షవర్ధన్‌ రెడ్డి రచిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో ఈ నెల 22న జరగనున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రజాశీర్వాదంతో సత్తాచాటబోతోంది.

కొల్లాపూర్‌ కోటపై గులాబీ జెండా

జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొంది ఛైర్మన్‌ పీఠాలను అధిరోహిస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కొల్లాపూర్‌ కోటపై కూడా గు లాబీ జెండా ఎగరబోతోంది. నగర పంచాయతీ, మున్సిపాల్టీగా మారిన దశాబ్దం తర్వాత తొలిసారిగా కొల్లాపూర్‌ పురపాలక కార్యవర్గ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో గెలిచేలా స్థానిక శాసన సభ్యులు బీరం హర్షవర్ధన్‌ రెడ్డి ముందు నుంచే ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. స్థానికంగా ప్రజాదరణ ఉన్న అభ్యర్థులకు బీ ఫాంలు ఇచ్చారు. ఇదే ఎన్నికల్లో కీలకంగా మారింది. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ప్రజలు సానుకూల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సైతం ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలుస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమనే విషయాన్ని ప్రజలకు అర్థయ్యేలా వివరించడంలో సఫలీకృతులవుతున్నారు. గత ఆరేళ్లలో రూ.4.50కోట్లతో పీజీ కళాశాల మంజూరు జరిగింది. రూ.1కోటితో హాస్టల్‌ భవనాల ని ర్మాణం చేపట్టారు. రూ.6కోట్లతో నాలుగు లేన్ల రో డ్డును, అలాగే డివైడర్‌ను నిర్మించారు. రూ.3కోట్లతో పుట్‌పాత్‌ పనులు జరుగుతున్నాయి. రూ.1కోటితో డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం పూర్తయ్యింది. రూ.80లక్షలతో తహశీల్దార్‌ కార్యాలయ నిర్మాణం జరిగింది. కొల్లాపూర్‌ రెవెన్యూ డివిజన్‌గా మారింది.

రూ.3కోట్లతో హిందూ, మైనార్టీలకు స్మశాన వాటికల నిర్మాణం చేపట్టడం విశేషం. అగ్నిమాపక కేంద్రానికి రూ.60లక్షలతో సొంత భవనం చేకూరింది. సింగవట్నం రిజర్వాయర్‌ నుంచి రూ.52కోట్లతో మంచినీళ్లు అందించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.3కోట్లతో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయి. మున్సిపాల్టీకి నూ తన భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్టేడి యం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయ పనులు చివరి దశలో ఉ న్నా యి. రూ.1.40కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌ ప నులు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తొలిసారి జరిగే కొల్లాపూర్‌ పుర ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ను గెలిపించేలా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారంలో స్వచ్ఛందంగా వందలాదిగా పాల్గొంటున్నారు. టీఆర్‌ఎస్‌కు వస్తున్న ప్రజాదరణ నాయకులు, అభ్యర్థుల్లో సంతోషాన్ని కనిపిస్తోంది. కొల్లాపూర్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, పురపాలిక మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్యే బీరంతో ఇటీవలే ప్రత్యేకం గా సమావేశమయ్యారు. ఎన్నికల సరళి, ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. మంత్రి కేటీఆర్‌ నిర్దేశనంలో ఎమ్మె ల్యే బీరం చేస్తున్న ప్రచారం కొల్లాపూర్‌ పుర ప్రజలను ఆకట్టుకుంటోంది. దీనివల్ల కాంగ్రెస్‌, కమలం పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు కనుమరుగయ్యారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారాలకు జనం వెల్లువలా వస్తుండటంతో ఆయా పార్టీలతో పాటుగా స్వతంత్ర నాయకులను సైతం గెలుపుపై పునరాలోచింపజేస్తోంది. మొత్తం మీద కొల్లాపూర్‌ పురపాలికలో జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం చూపనుందన్న ధీమా పార్టీ నేతలు, అభ్యర్థుల్లో వ్యక్తం అవుతున్నాయి.


logo