శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jan 18, 2020 , 03:41:34

కిటకిటలాడిన ఉమామహేశ్వర క్షేత్రం

కిటకిటలాడిన ఉమామహేశ్వర క్షేత్రం
  • - రంగాపూర్‌ గంధోత్సవంతో పెరుగనున్న భక్తుల రద్దీఅచ్చంపేట రూరల్‌: శ్రీశైల ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం పార్వతీ, పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ప్రాతరౌపాసన, బలిహరణము, నీరాజనము, మంత్రపుష్పము, సాయమౌపాసన, సదస్యం, అశ్వవాహనసేవ తదితర పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 వరకు కొనసాగుతాయని ఆలయ చైర్మన్‌ సుధాకర్‌, కార్యనిర్వహణ అధికారి శ్రీనివాస్‌రావు తెలిపారు. రంగాపూర్‌ నిరంజన్‌ షావలీ గంధోత్సవం తర్వాత భక్తుల సంఖ్య మరింత పెరుగనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఉమామహేశ్వర క్షేత్రాన్ని సందర్శించి పాపనాశనము, నాగులు, పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు చేసి పునీతులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్డీవో పాండునాయక్‌, డీఎస్పీ నర్సింహులు, తాసిల్దారు చంద్రశేఖర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది రామకృష్ణ, లక్ష్మయ్య, పర్వతాలు, శంకర్‌, ఊమ్లా, రమేశ్‌ తదితరులు ఉన్నారు.

నేటి నుంచి రంగాపూర్‌ ఉర్సు

అచ్చంపేట రూరల్‌: మండల పరిధిలోని రంగాపూర్‌ నిరంజన్‌ షావలీ ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. శుక్రవారం రాత్రికి ఆయా గ్రామాల నుంచి గంధోత్సవాలు బయలుదేరి శనివారం తెల్లవారుజామున నిరంజన్‌ షావలీ దర్గా వద్దకు చేరుకుంటాయి. గంధోత్సవాలు దర్గా వద్దకు వచ్చిన వెంటనే వేలాది మంది కందూర్లు చేసి పాతేహా సమర్పించుకుంటారు. దీంతో మొదటిరోజు వేలాది మంది భక్తులు నిరంజన్‌ షావలీని దర్శించుకుంటారు. ఉత్సవాలు వారం రోజులపాటు కొనసాగనున్నాయి.

ఉర్సుకు తరలిన గంధోత్సవాలు

అమ్రాబాద్‌ రూరల్‌: రంగాపూర్‌ ఉర్సుకు మండలంలోని మన్ననూర్‌, దోమలపెంట తదితర గ్రామాల నుంచి ముస్లింలు గంధోత్సవాలు ప్రారంభించారు. ఈ వేడుకలను తిలకించేందుకు ముస్లింలతోపాటు, హిందువులు కూడా పెద్దమొత్తంలో పాల్గొన్నారు.  కార్యక్రమంలో మైనార్టీ పెద్దలు, సర్పంచ్‌ శ్రీరాం, ఎంపీటీసీలు బాలమణి, శ్రీను, మాజీ సర్పంచ్‌ నిమ్మలశ్రీనివాసులు, మండల కోఆప్షన్‌ సభ్యులు ఎండీ రహీం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవిందర్‌రెడ్డి, నాయకులు నిరంజన్‌, మహిందర్‌గౌడ్‌, గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్యం, రవికుమార్‌ తదితరులు ఉన్నారు.logo