శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 17, 2020 , 02:27:20

వైభవంగా ఈదమ్మ ఉత్సవాలు

వైభవంగా ఈదమ్మ ఉత్సవాలు


కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : సక్రాంతి పర్వదినాన్ని  పురస్కరించుకొని కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో నిర్వహిస్తున్న ఈదమ్మ మాం ధాత గ్రామ దేవత ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. మూడ్రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన ఈ వేడుకలు గురువారంతో ముగిశాయి. బుధవారం సాయంత్రం బండి సిడే కార్యక్రమాన్ని పెద్దఎత్తున్న నిర్వహించారు. గ్రామం పచ్చని పంటలతో కళకళలాడాలని కోరుతూ బండి సిడేకు పైభాగాన పట్టు వస్ర్తాల మధ్య గొర్రెపిల్లను కట్టి ఊరేగించారు. బండి సిడే కార్యక్రమానికి ఎమ్మెల్యే జైపాల్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్ర త్యేక పూజలు నిర్వహించారు.   పెద్దఎత్తున తా ం డ్ర గ్రామస్తులతో పాటు చుట్టు పక్కలగ్రామాలకు చెందిన వారు హాజరయ్యాయి.

బండ్ల బోనాలు..

ఈదమ్మ ఉత్సవాల్లో భాగంగా  బండ్ల బో నాలు నిర్వహించారు. అందంగా అలంకరించిన ఎడ్లబండ్లు ఈదమ్మ గుడి నుంచి ప్రారంభమై ఊరికి తూర్పు దిశలో ఉన్న తిరుమలయ్య స్వామి గుండు చుట్టూ తిరిగి  ఈదమ్మ గుడివద్దకు చేరుకుంటాయి, గుడి చుట్టూ ఎడ్లబండ్ల ప్రదక్షిణలు చేపట్టారు. కార్లు ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్లతో ప్రదక్షిణలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుశీలతో పాటు టీఆర్ నాయకులు ఈశ్వరయ్య, వెంకట్ పాల్గొన్నారు.

పంజుగులలో ఎడ్లబండ్ల ఊరేగింపు..

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కల్వకుర్తి మండలం పంజుగులలో  బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. గ్రామంలోని బాలాంజనేయస్వామి ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేశారు.  పంజుగుల గ్రామంతో పాటు తుర్కల పల్లికి చెందిన గ్రామస్తులు తమ ఎద్దుల బండ్లతో ర్యాలీగా దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వాహనాలను  దేవాలయం చుట్టూ తిప్పారు. బండ్ల బోనాలను పురస్కరించుకొని సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ, ఎంపీటీసీ సభ్యులు మనోహర, అంజియాదవ్, చెన్నకేశవ్,శ్రీనివాస్ కృష్ణయ్య, రామకిష్టయ్య, వెంకటయ్య, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తులు..

వెల్దండ : మండలంలోని చెర్కూర్ గ్రామంలో బుధ,గురు వారాల్లో ఇదమ్మ, మాందాత ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహించారు. సంక్రాంతి పండుగ పర్వదినాల్లో ప్రతి యోటా చెర్కూర్ గ్రామంలో ఇదమ్మ మాందాత ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. గొర్రెను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి తేరుకు గొర్రెను కట్టి బండి షిడే నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేవతి రాజశేఖర్ గొర్రెను పూజించి  బండి షిడే ను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్యే జైపాల్ జాతీయ బీసీ కమిషన్ మెంబర్ ఆచారి, టీఆర్ నేత గోళి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. మండలంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యల్లో తరలివచ్చారు. బుధవారం నిర్వహించిన బండిషిడే కార్యక్రమంలో ప్రజలు వేలాదిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం బండ్లు తిరుగుట, సవారమ్మ బోనాలు నిర్వహించారు.  పసుపు,కుంకుమ, వేపాకులతో శోభాయమానంగా అలంకరించిన బోనం కుండలను మహిళలు నెత్తిన పెట్టుకొని గ్రామంలో ఆటా, పాటలతో ఊరేగింపు నిర్వహించారు. ఆలయం చుట్టు ప్రదిక్షణలు చేసి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.  ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు  నాయకులు, భక్తులు, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు..logo