మంగళవారం 02 జూన్ 2020
Nagarkurnool - Jan 14, 2020 , 03:39:25

పకడ్బందీగా నిర్వహించండి

పకడ్బందీగా నిర్వహించండి


నాగర్‌కర్నూల్‌ టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మున్సిపల్‌ ఎన్నికల సంసిద్ధతపై సమీక్షలో చర్చించారు. పోలింగ్‌ కేంద్రాల ఖరారు. ఓటర్ల జాబితా, బ్యాలెట్‌ పత్రాల ముద్రణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అభ్యర్థుల ఖర్చు, పర్యవేక్షణకోసం స్కాడ్‌ ఏర్పాటు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు, వెబ్‌ కాస్టింగ్‌, సున్నిత సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం ఈనెల 14వ తేదీన అభ్యర్థులు, వార్డుల వారీగా నామినేషన్‌ ఉపసంహరణ అనంతరం వెంటనే అభ్యర్థుల చివరి జాబితా సిద్ధం చేసి బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.   సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర మున్సిపల్‌ సంచాలకులు టీకే శ్రీదేవి మాట్లాడుతూ... పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. అభ్యర్థుల ఎన్నికల ప్రచారంపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఓటర్లను ప్రభావితం చేసే చర్యలపై గట్టి నిఘా ఉంచాలన్నారు.
  

పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం.

ఎన్నికల నిర్వాహణలో భాగంగా జిల్లాలోని కొల్లాపూర్‌, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలను నిర్వహించేందుకు పటిష్టంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ శ్రీధర్‌ వివరించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి రెండో విడత శిక్షణ అందించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామని కలెక్టర్‌ వివరించారు. వీసీలో మున్సిపల్‌ కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో నాగలక్ష్మి, శ్రీరాములు,  పాల్గొన్నారు.logo