శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 14, 2020 , 03:33:30

సంబురాల సంక్రాంతి

సంబురాల సంక్రాంతి


నాగర్‌కర్నూల్‌టౌన్‌: “సంబురాలను మోసు  సంక్రాంతి వేడుకలు నేటి నుంచి ప్రారంభం కాను   జిల్లాలోని ఊరూ  అంతా పండు  శోభను తెచి  మూడు రోజుల  జరుపుకునే ఈ పండు  భోగి, సంక్రాంతి, కనుమగా ముచ్చటగా జరుపుకుంటారు. పండగ సందర్భం  వారం రోజుల ముందు  ఇండ్లకు చేరుకున్న ఆడ పడుచు  కళ కళలా డుతున్నాయి. ఆడప  వేసిన ముంగిట ముగ్గులతో ప్రతి ఇండ్లు సంబురంగా కని  హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల విన్యాసాలతో సందడి చేయనున్నారు.  ఇక మహిళల పిండి వంటల ఘుమఘుమలతో ప్రతి ఇండ్లు        సూర్యుడు మేషాది ద్వాదశ రాశులలో క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్త  రాశిలోకి ప్రవేశించడాన్ని సంక్రాంతి అంటారు. పుష్యమాసం హేమంత రుతువులో శీతల గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రముఖ్యత సంతరించుకుంది. ప్రతిఏటా జన  మాసంలో వచ్చే మకర సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడు  ఆరోజున స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు చెబుతున్న చరిత్ర.

భోగభాగ్యాల భోగి....

భోగి పండుగను సాధారణంగా ప్రతి ఏడాది సంక్రాంతికి ముందు రోజు జరుపుకుంటారు. ఏడాది కాలంలో ఆకాలంలో ఉండే చలిని పారదోలేందుకు భోగి మంటలను వేస్తారు. ఇంట్లో ఉన్న పాత చీపుర్లు, తట్టలు, విరిగిపోయిన బల్లాలు తదితర వస్తువులను భోగి మంటల్లో వేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా భోగి పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.

సంక్రాంతి వేడుక ఇలా...

సంక్రాంతి పండుగను జరుపుకునే మూడు రోజుల్లో రెండో రోజున తీపి వంటలతో ప్రతి ఇంట పండగ వాతావరణంలో నెలకొంటుంది. ఈ  పాలు పొంగిస్తారు. పిం  తీపి వంటలు చేసుకుంటారు.  సంక్రమణాలకు ఇవ్వకపోయినా, ఈ  సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు తప్పని సరీగా ఇస్తారు. ఏడాది కాలంలో 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి తప్పని సరీగా పితృ తర్పణాలు ఇస్తారు.
కోడి పంద్యాలతో కనుమ వేడుకలు
మూడవరోజైన కనుమ పండుగను కోడి పంద్యాలతో జరుపుకుంటారు. వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందున ముఖ్యంగా పశువులకు శుభాకాంక్షలు తెలుపడానికి జరుపుకుంటారు. ఎక్కువగా కోడి పంద్యాలు కూడా నిర్వహిస్తారు.   ఈ రోజున ప్రయాణాలు చేస్తే కీడు జరుగుతుందని ఓ నమ్మకం. ప్రయాణాలు చేయకపోవడం అనేది కూడా సాంప్రదాయంగా వస్తున్నది.

సంస్కృతిని చాటు చెబుతున్న ముగ్గుల పోటీలు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లా అంతటా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ  తెలంగాణ ప్రాంతంలో మహిళల్లో చైతన్యాన్ని నింపుతుంది. పలు పత్రికల ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించిన ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. రంగోళి వేడుకల్లో మహిళలు, పాఠశాల, కళాశాల విద్యార్థినులు పాల్గొని రంగు రంగుల ముగ్గులు వేస్తూ ఆస్వాధించారు.  ముగ్గుల పోటీలతో జిల్లాలో పండగకు ముందుగానే సందడి వాతావరణం కనిపించింది.


logo