గురువారం 28 మే 2020
Nagarkurnool - Jan 13, 2020 , 03:45:49

రసవత్తరంగా..

రసవత్తరంగా..

మహబూబ్‌నగర్‌ స్పోర్ట్స్‌ : జిల్లా కేంద్రంలో జాతీయస్థాయి ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 విభాగం సూపర్‌-7 క్రికెట్‌ టోర్నీ రసవత్తరంగా కొనసాగింది. ఆదివారం బాలుర కళాశాల మైదానంలో బాలికల జట్లకు, ఎండీసీఏ మైదానంలో బాలుర జట్ల కు మ్యాచ్‌లు నిర్వహించారు. హోరాహోరీగా సాగిన పోరులో తెలంగాణ బాలుర జట్టు సీబీఎస్‌ఈ, చత్తీస్‌గడ్‌ జట్లపై, తెలంగాణ బాలికల జట్టు పంజాబ్‌, చత్తీస్‌గడ్‌పై గెలుపొంది శుభారంభం చేశాయి.

మ్యాచ్‌ల వివరాలు..

బాలుర విభాగంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ జట్టు సీబీఎస్‌ఈ జట్టుపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన సీబీఎస్‌ఈ జట్టు 7 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. జట్టులో జతీన్‌సింగ్‌ 16 పరుగులు చేశాడు. రాష్ట్ర బౌలర్లలో అబిలాష్‌ 2 వికెట్లు తీ శాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాష్ట్ర జట్టు 3.2 ఓవర్ల లో వికెట్‌ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. జట్టులో విశాల్‌గౌడ్‌ 29, అద్నాన్‌ 26 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరో మ్యాచ్‌లో చత్తీస్‌గడ్‌పై 5 వికెట్ల తేడాతో తెలంగాణ జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన చత్తీస్‌గడ్‌ జట్టు 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది. రాష్ట్ర బౌ లర్లలో పశుపతి 2,అబిలాష్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన తెలంగాణ జట్టు 4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసి గెలుపొందింది. జట్టులో విశాల్‌గౌడ్‌ 32 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో జమ్మూకశ్మీర్‌ జట్టు ఢిల్లీపై 12 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన జమ్మూకశ్మీర్‌ జట్టు 7 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. జట్టులో రాఘవా రాకూర్‌ 40 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. జట్టులో అమాన్‌ 28 పరుగులు చేశాడు. మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు ఆంధ్రప్రదేశ్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొ దట బ్యాటింగ్‌ చేసిన ఏపీ జట్టు 7 ఓవర్లలో 2 వికెట్ట నష్టానికి 70 పరుగులు చేసింది. జట్టులో వెంకటేశ్‌ 24 పరుగులు చేశా డు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర జట్టు వికెట్‌ న ష్టాపోకుండా 73 పరుగులు చేసి విజయం సాధించింది, అ లాగే, పంజాబ్‌ జట్టు యూపీపై 5 వికెట్ల తేడాతో, ఢిల్లీ జట్టు రాజస్థాన్‌పై 6 వికెట్ల తేడాతో, మహారాష్ట్ర జట్టు సీబీఎస్‌ఈపై 43 పరుగుల తేడాతో విజయం సాధించాయి.

బాలికల విభాగంలో..

బాలికల విభాగంలో జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ బాలికల జట్టు పంజాబ్‌పై 68 పరుగుల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ జట్టు 7 ఓవర్లలో 1 వికెట్‌ నష్టానికి 121 పరుగులు చేసింది. జట్టులో అంజలి 40 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ జట్టు 7 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. మరో మ్యాచ్‌లో జమ్మూ కశ్మీర్‌పై 33 పరుగుల తేడాతో తెలంగాణ జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్‌ చేసిన తెలంగాణ జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. హోరాహోరీ పోరులో అమ్‌తీ 22, మంజుల 21 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జమ్మూ కశ్మీర్‌ జట్టు 7 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసి ఓటమిపాలైంది. అలాగే, ఢిల్లీ జట్టు రాజస్థాన్‌పై 7వికెట్ల తేడాతో, చత్తీస్‌గడ్‌ జట్టు పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో, సీబీఎస్‌ఈ జట్టు పంజాబ్‌పై 7 వికెట్ల తేడాతో, యూపీ జట్టు ఏపీపై 7 వికెట్ల తేడాతో, మహారాష్ట్ర జట్టు యూపీపై 40 పరుగుల తేడాతో, చత్తీస్‌గడ్‌ జట్టు సీబీఎస్‌ఈపై 59 పరుగుల తేడాతో విజయం సాధించాయని నిర్వాహకులు తెలిపారు.

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

- మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేశ్‌
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని మార్కె ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ రాజేశ్‌ అన్నారు. బాలుర కళాశాల మై దానంలో నిర్వహించిన బాలికల మ్యాచ్‌లను రెండో రోజు ఆ యన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ క్రీడల్లో రాణించే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. జిల్లా కేంద్రంలో జాతీయస్థాయి టోర్నీ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ అండర్‌-19 కార్యదర్శి పాపిరెడ్డి, టోర్నీ ఆర్గనైజర్‌ సురేశ్‌కుమార్‌, టెక్నికల్‌ అఫీషియల్‌ బాల్‌రాజ్‌, జాతీయ, రాష్ట్ర పరిశీలకులు విశాల్‌ పఠాక్‌, బీఎస్‌ ఆనంద్‌, జిల్లా క్రికెట్‌ సంఘం ప్రతినిధులు అశోక్‌, కృష్ణమూర్తి, వ్యాయామ ఉపాధ్యాయులు రాంచందర్‌, వేణుగోపాల్‌, అబ్దుల్లా, జగన్మోహన్‌గౌడ్‌, రాఘవేందర్‌, నాగరాజు, ముకర్రం, రామ్మోహన్‌ పాల్గొన్నారు.


logo