శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jan 13, 2020 , 03:43:56

వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి

వివేకానందుడిని స్ఫూర్తిగా తీసుకోవాలి


లింగాల: యువత కంటున్న కలలను సహకారం చేసుకొని మహానీయుల ఆశయ సాధనకు కృషిచేయాలని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతిని పురష్కరించుకొని మండలంలోని కోమటి కుంటలో స్వామివివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సర్పంచ్‌ గుడిబచ్చన్న అధ్యక్షతన 17మంది దాతల సహకారంతో రూ. 2లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన స్వామివివేకానంద విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సన్‌ మార్గంలో పయణించాలంటే వివేకానందుడి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొవాలన్నారు. మంచిని పెంపొందించుకునేందుకు ప్రణాళిక బద్దంగా నిబద్దతో పని చేయాలన్నారు. అనంతరం చిన్నారులు చేసిన నృత్యాలు, భరతనాట్యం తదితర ఆటపాటలు పలువురి ఆకట్టుకున్నాయి. అదేవిధంగా మండలంలోని అప్పాయిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో స్వామివివేకానంద సేవ సమితి అధ్యక్షులు గుడి స్వామి, సరస్వతి శిశుమందిర్‌ ప్రధానకర్త కందూరి విధ్యాన్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌, సర్పంచులు గుడి బచ్చన్న, కోనేటి తిర్పతయ్య, ఉపసర్పంచ్‌ శశిదర్‌రెడ్డి, ఎంపీటీసీ తిర్పతయ్య, కమిటీ సభ్యులు శివకుమార్‌, నవీన్‌కుమార్‌, రాజు,రాముడు,హెచ్‌ఎం ఖాజామైనోద్దీన్‌, హెచ్‌ఎం అంజిలాల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు జయంత్‌రెడ్డి, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

పల్లె ప్రగతితో సత్వర అభివృద్ధి

ఉప్పునుంతల: ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతితో గ్రామాల్లో సత్వరమే ఎంతో అభివృద్ధి జరుగుతుందని, ప్రభుత్వ విప్‌ మ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని దేవదారికుంటతండాలో డంపింగ్‌యార్డు, శ్మశానవాటిక ని ర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ..  ప్రభుత్వం ఎంతో ముందుచూపుతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు దేశంలో ఎక్కడ లేవన్నారు.  కార్యక్ర మంలో సర్పంచ్‌ బొట్టు పర్వతాలు, ఎంపీపీ అరుణా నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ ప్రతా ప్‌రెడ్డి, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

ప్రతి ఎకరాకు సాగునీరు

బల్మూరు: నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే టీఆర్‌ఎస్‌ లక్ష్యమని  ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు అన్నారు. ఆదివారం మండలంలోని బాణాలలో పల్లెప్రగతి ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ..  ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని చేరవన్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతల ను నిర్మించుకోవాలని అన్నారు. అనంతరం గ్రా మంలో ప్రజలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ అరుణ, డీఎల్‌పీవో సురేశ్‌ కు మార్‌, ఎంపీడీవో దేవన్న, సర్పంచ్‌ ఎంపీటీసీ అనిత వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ మల్లేశ్‌, నాయకులు కరుణాకర్‌రావు, నాగరాజు, సుధాకర్‌  ఉన్నారు.


logo