శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 13, 2020 , 03:43:06

స్క్రూట్నీలో అన్ని నామినేషన్లు చెల్లుబాటు

స్క్రూట్నీలో అన్ని నామినేషన్లు చెల్లుబాటునాగర్‌కర్నూల్‌ టౌన్‌ : మున్సిపల్‌ ఎన్నికల పోరులో నామినేషన్ల పరిశీలన కొనసాగుతుంది. ఆదివారం జరిగిన స్క్రూట్నీలో జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో అన్ని నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 613 నామినేషన్లలో నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఓ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో మిగతావారు అందరూ కూడా బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కల్వకుర్తిలో శనివారం తిరస్కరణకు గురైన అభ్యర్థులు రెండు సెట్లు నామినేషన్లు వేయడంతో ఆదివారం అప్పీలుకు దరఖాస్తు చేసుకోలేదు. దీంతో జిల్లాలో 66 వార్డులకు  419 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని ముడు మున్సిపాలిటీల పరిధిలో ఆదివారం నామినేషన్ల స్కూృట్నీ జరిగింది. ఇందులో నామినేషన్లను పరిశీలించిన అధికారులు అన్ని నామినేషన్లు చెల్లుబాటు అయినట్లు వెల్లడించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కొల్లాపూర్‌, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీల పరిధిలోని 66 వార్డులకు 419 మంది అభ్యర్థులకు చెందిన 613 నామినేషన్లు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో కాంగ్రెస్‌ తరుపున నామినేషన్‌ వేసిన అభ్యర్థి ఆవుల మంగమ్మ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుంది.  ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల అధికారులకు విన్నవించింది. కొల్లాపూర్‌, కల్వకుర్తి మున్సిపాలిటీల పరిధిలో ఎలాంటి ఉపసంహరణలు జరగలేదు. దీంతో 613 నామినేషన్లకు గాను 612 నామినేషన్లు అధికారుల పరిశీలనలో ఉన్నాయి. గత శనివారం కల్వకుర్తికి చెందిన ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.  ఆదివారం వారు అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ రెండు సెట్లు వేసి ఉండడంతో అప్పీలు చేసుకునేందుకు ఎవరు రాలేదని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇక 14న మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణలే తరువాయి కావడంతో, పార్టీల తరుపున కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా ఆమా వార్డుల నుంచి నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకోవాలని బుజ్జగించే పనుల్లో పార్టీల అభ్యర్థులు, ఉపసంహరణల అనంతరం 15న పోటీలో ఉండే అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించనున్నారు.


logo