శనివారం 06 జూన్ 2020
Nagarkurnool - Jan 13, 2020 , 03:42:42

ప్రగతిపథంలో పల్లెలు

ప్రగతిపథంలో పల్లెలుతెలకపల్లి :  గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం అందరి బాధ్యత అని నాగర్‌కర్నూల్‌ జెడ్పీచైర్‌ పర్స్మన్‌ పెద్దపల్లి పద్మావతి అ న్నారు. ఆదివారం  మండలంలోని కార్వంగ గ్రామంలో నిర్వహించిన పల్లెప్రగతి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ రెండో విడుత పల్లెప్రగతిలో చేపట్టిన పనులతో గ్రామాల్లో స్వచ్ఛత నెలకొందన్నారు. మొక్కలను పెంచి రక్షించడానికి ట్రీ గార్డ్స్‌ ఏర్పాటు చేయడం జరుగుతుదన్నారు.  అనేక గ్రా మాల్లో డంపింగ్‌యార్డులకు స్థల సేకరణ జరిగిందన్నారు. అందరూ గ్రామాబివృద్ధికి కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా కృష్ణా జలాలను తరలించి సస్యశ్యామలం చేయడం జరిగిందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు.  రాజలింగం అనే గ్రామపెద్ద తన విలువైన ఇంటిని గ్రామపంచాయతీ  భవనానికి ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ జెడ్పీచైర్‌పర్సన్‌ ఆయన్ని శాలువాతో సత్కరించారు. దాతల సాకారంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. తన ఇంటిని గ్రామ పంచాయతీకి ఇవ్వడం హర్షణీయమన్నారు. గ్రామస్తులు కోరినట్లుగా గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మధు, ఎంపీడీవో అజారుద్దిన్‌, విండో చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ విజయనిర్మల, సర్పంచ్‌ లక్ష్మి, భాస్కర్‌గౌడ్‌, మండల అధ్యక్షుడు హన్మంత్‌రావు, మాజీ ఎంపీపీ బండ పర్వతాలు, నాయకులు యాదయ్య, రాజేందర్‌రెడ్డి, యాదవరెడ్డి, మాజీ ఎంపీటీసీ బంగారయ్య, స్వామి, మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.


logo