శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 13, 2020 , 03:42:10

కల్వకుర్తిలో ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

కల్వకుర్తిలో ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్‌కల్వకుర్తి, నమస్తే తెలంగాణ: కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎదురులేని శక్తిగా టీఆర్‌ఎస్‌ మారిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పేర్కొన్నారు. కల్వకుర్తి హనుమాన్‌నగర్‌ 16వ వార్డు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌సింగ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీసింగ్‌ రాంచందర్‌సింగ్‌కు గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని అన్నారు. కల్వకుర్తిలో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టం కట్టనున్నారని పేర్కొన్నారు. కల్వకుర్తి మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే మనమే పరిష్కరించుకుందాం తప్పా.. పార్టీని ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకురావద్దని ఎమ్మెల్యే సూచించారు. కార్యకర్తలందరికీ అండగా పార్టీ ఉంటుందని, ఏదో విధంగా అందరికీ న్యాయం చేస్తామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ పార్టీ చైర్మన్‌ అభ్యర్థి ఎడ్మ సత్యం, మాజీ చైర్మన్‌, 16వ వార్డు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీశైలం, సూర్యప్రకాశ్‌, జనార్దన్‌రెడ్డి, రాఘవరావు, శ్రీధర్‌, భగత్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.


logo