బుధవారం 03 జూన్ 2020
Nagarkurnool - Jan 12, 2020 , 03:11:11

అడవుల సంరక్షణతోనే జీవరాసుల మనుగడ

అడవుల సంరక్షణతోనే జీవరాసుల మనుగడ


 అచ్చంపేట రూరల్‌ : అడవుల సంరక్షణతోనే సమస్త జీవరాసుల మనుగడ సాధ్యమని ప్రిన్సిపాల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్టు (పీసీపీఎఫ్‌) శోభ అన్నారు. శనివారం మండలంలోని రంగాపూర్‌ శివారులో ఏర్పాటు చేసిన పండ్ల తోట (ఫ్రూట్‌ బెర్రీ) ను, మొక్కలు పెంచుతున్న ప్రదేశాల రికార్డులను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి ఆమె పరిశీలించారు. హరితహరంలో భాగంగా ఏర్పాటు చేసిన మొక్కల పెంపకాన్ని చూసి అటవీశాఖ అధికారుల పనితీరు ను కొనియాడారు. అడవుల్లో, వ్యవసాయ పొలాల్లో పండ్ల మొక్కలను పెంచడం వల్ల పక్షులకు,  జంతువులకు కలిగే ఉపయోగాలను వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెద్దదైన అమ్రాబాద్‌ అభయారణ్యంలో పెద్ద పులులు, సింహాలు, చిరుతలు, ఎలుగుబంట్లు అధికంగా ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. అటవీ జంతువుల సౌకర్యానికి తాగునీటి వసతీ కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో ఫీల్డ్‌ డైరెక్టర్‌ అశోక్‌కుమార్‌ సిన్హా, అటవీశాఖ డివిజన్‌ అధికారులు రాజశేఖర్‌, సుధాకర్‌, ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్‌, పదర జెడ్పీటీసీ రాంబాబునాయక్‌,  రైతు సమన్వయ  సమితి మండల అధ్యక్షుడు  రాజేశ్వర్‌రెడ్డి,  నాయకులు, అధికారులు ఉన్నారు.


logo