శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jan 12, 2020 , 03:07:06

పారిశుధ్య పనులు చేపట్టాలి

పారిశుధ్య పనులు చేపట్టాలి


అమ్రాబాద్‌ రూరల్‌ : గ్రామాల్లో నిరంతరంగా పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరి ఆర్‌ శోభ అన్నారు. మండలంలోని వెంకటేశ్వర్లబావి, మాచారం గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకటేశ్వర్లబావి గ్రామానికి చేరుకున్న పీసీసీఎఫ్‌కు సర్పంచ్‌ ఉడుతనూరి పద్మ, అటవీశాఖ అధికారులు పూలబోకెలతో స్వా గతం పలికారు. గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.  గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసే ఫ్లెక్సీని వీక్షించారు.  సర్పంచ్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో పీసీసీఎఫ్‌ మాట్లాడుతూ రెండో విడుతలో గ్రామంలో ఏ ఏ కార్యక్రమాలు చేపట్టారో వివరించాలని ఎంపీడీవోను కోరగా.. గ్రామంలో మొదటి రోజు నుంచి చేపట్టిన పనులకు సంధిందించిన  డాక్యుమెంట్‌ను ఫొటోలతో చూయించడంతో అధికారులను అబినందించారు.  గ్రామాల్లో నర్సరీలు ఉన్నాయా, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు,  అధికారుల పనితీరుపై ఆరా తీశారు. మాచారంలో  మొక్కలను నాటారు.  కార్యక్రమంలో ఏటీఆర్‌ పీల్డ్‌ డైరెక్టర్‌ ఏకే. సిన్హా ఐఎఫ్‌ఎస్‌,  ఐటీడీఏ పీవో డాక్టర్‌ వెంకటయ్య, జిల్లా అటవీశాఖ అధికారి జోజి, డీఎల్‌పీవో, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, ఎఫ్‌డీవోలు సుధాకర్‌రావు, శేఖర్‌రెడ్డి, జిల్లా ైప్లెయింగ్‌ స్కాడ్‌ డాక్టర్‌ వీరేంద్రబాబు, రేయింజర్లు ప్రభాకర్‌, మురళిమనోహర్‌, మనోహర్‌, రవిమనోహర్‌భట్‌, డీఆర్వో వాణి, మండల పంచాయితి అధికారి వెంకటయ్య, టీసీ కృష్ణ, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు, అధికారులు తదితరులు  పాల్గొన్నారు.


logo