సోమవారం 25 మే 2020
Nagarkurnool - Jan 12, 2020 , 03:06:25

అటవీ భూములపై హక్కులు కల్పించాలి

అటవీ భూములపై హక్కులు కల్పించాలిపదర : అటవీ భూములను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు భూముల హక్కులు కల్పించాలని ప్రభుత్వ విప్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్కొన్నారు. శనివారం మండలంలోని రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన  పనులను పరిశీలించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో రూ.1.95లక్షలతో నిర్మించునున్న మురుగుదొడ్లు భూమిపూజ నిర్వహించారు. మండలంలోని చెన్నంపల్లి పదరలో శ్మశాన వాటికలకు భూమిపూజ చేశారు. అనంతరం చిట్లకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువత ఆలోచన గ్రామాభివృద్ధి వైపు ఉండాలని  సూచించారు. యురేనియం తవ్వకాల పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ  ఈ ప్రాంత ప్రజలను భయాందోళనకు గురి చేయొద్దన్నారు.  మద్దిమడుగు , ఉడిమిళ్ల ,మారడుగు , ఇప్పలపల్లి గ్రామాలకు ట్రాక్టర్లను పంపిణీ చేసి 10మందికి కల్యాణలక్ష్మి లబ్ధిదారుల            చెక్కులను అందజేశారు . పదర మండలంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ భిక్య నాయక్‌, జెడ్పీటీసీ రాంబాబు నాయక్‌, వైస్‌ఎంపీపీ వరుణ్‌, సర్పంచ్‌ ప్రవీణ్‌, నీలవిష్ణు, తాసిల్దార్‌ కృష్ణయ్య, అధికారులు, మండల అధ్యక్షుడు వెంకటయ్య, విష్ణుమూర్తి,శంకర్‌,నోడల్‌ ఆఫీసర్‌ ఉదయ్‌, నాయకలు గ్రామస్తులు పాల్గొన్నారు.


logo