బుధవారం 27 మే 2020
Nagarkurnool - Jan 12, 2020 , 03:05:11

వార్తా ఛానల్‌పై చర్యలకు ఫిర్యాదు

వార్తా ఛానల్‌పై చర్యలకు ఫిర్యాదు


ఇటిక్యాల : తన ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా కల్పిత వార్తలు ప్రసారం చేసిన వార్తా ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం శనివారం కోదండాపూర్‌లోని సీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. నియోజక వర్గంలోని తన అనుచరులతో కలిసి సర్కిల్‌ కార్యాలయానికి ఎమ్మెల్యే చేరుకున్నారు. శుక్రవారం ఒక వార్తా ఛానల్‌లో తన వివరణ లేకుం డా అవాస్తవాలను ప్రసారం చేసి ప్రజల్లో, ము ఖ్యంగా మున్సిపల్‌ ఎన్నికల ఓటర్లను ప్రభావితం చేసేలా, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వార్తను ప్రసారం చేశారని పేర్కొన్నారు. వార్తను ప్రసారం చేసిన ఛానల్‌ యాజమాన్యంపై, అలాగే వార్తా ప్రసారానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పోలీసులను కోరారు.

ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీలు రాజు, హన్‌మంత్‌ రెడ్డి, సుగుణమ్మ, ఎంపీపీ భీసమ్మ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, నీలంగౌడ్‌, సుదర్శన్‌ గౌడ్‌, నారాయణరెడ్డి, బైరాపురం రమణ, ఆత్మ లింగారెడ్డి, శంకర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo