శుక్రవారం 05 జూన్ 2020
Nagarkurnool - Jan 10, 2020 , 11:43:10

బకాయిల వసూలుపై దృష్టి సారించాలి

బకాయిల వసూలుపై దృష్టి సారించాలి

పాలమూరు : విద్యుత్ బకాయిల ను ఎప్పటికప్పుడు వసూలు చేయడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సా రించాలని టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, రాములు, మధన్మోహన్‌లు ఆదేశించారు. గురువా రం జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవనంలో నిర్వహించిన స మీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యుత్ బకాయిల వసూలులో అలసత్వం ప్ర దర్శించవద్దని తెలిపారు. ప్రభుత్వ కా ర్యాలయాల బకాయిలను కూడా సకాలంలో వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. అదేవిధంగా విద్యుత్ సరఫరా ని రంతరం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారులకు ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని, అలాంటప్పుడే నెలవారీగా బిల్లులను వినియోగదారులు సక్రమంగా చెల్లిస్తారని తెలిపారు. వ్యవసాయానికి సంబంధించి నూతనంగా ట్రాన్స్‌ఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు సకాలంలో వాటిని అందిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాటితోపాటు రైతులు చెల్లించాల్సిన బిల్లులను కూడా వసూలు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల కు సంబంధించి లూజ్ లైన్లు సరి చేయడంతోపాటు కా వాల్సిన స్తంభాలు, వీధి దీపాల కోసం ప్రత్యేక లైన్ ఏ ర్పాటు చేయాలని తెలిపారు. గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన బకాయిలను కూడా వసూలు చేయాలన్నారు. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న సబ్ స్టేషన్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీజీఎం లొల్యా రామునాయక్, ఎస్‌ఈ లు బిక్షపతి, చక్రపాణి తదితరులు ఉన్నారు.


logo