శుక్రవారం 07 ఆగస్టు 2020
Nagarkurnool - Jan 10, 2020 , 11:39:56

మిగిలింది ఒక్కరోజే..

మిగిలింది ఒక్కరోజే..

మహబూబ్ నగర్, నమస్తే తెలంగాణ : సంక్రాంతి పండుగను మరింత ముందస్తుగా పట్టణ ప్రాంతాలకు మున్సిపల్ ఎన్నికల తీసు కువచ్చాయి. ప్రతి పండుగకు కుటుంబ సభ్యు లతో గడిపే కౌన్సిలర్ల అభ్యర్థులు ఈ సంక్రాంతి పండుగ మాత్రం ప్రజలను కలిసే పనిలో నిమగ్నమవుతూ ప్రచారం చేసుకుంటూ పండుగ జరుపుకునేందుకు సిద్ధం అవుతుండ్రు. ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఇవ్వడం, ఆ చివరి రోజు శుక్రవారం కావడంతో అభ్యర్థులు నేడు నామినేషన్లు అధికంగా దాఖలు చేసు కునేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అవసరమైన పత్రాలతో పాటు తమకు నమ్మకం ఉన్న దైవంను స్మరించుకుంటూ నామినేషన్లను దాఖలు చేసేందుకు మరింత ప్రత్యేక శ్రద్ధ కనబర్చుతున్నారు. మొదటి, రెండు రోజులు అధిక వార్డుల నుంచి నామినేషన్లు రాలేదనే తెలుస్తుంది. ప్రతి ఇంటా పండుగ వాతావరణం నింపేలా ఈ మున్సిపల్ ఎన్నికలు వేదిక కావడం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.

మిగిలింది ఈ రోజే..
మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండేందుకు గానూ అభ్యర్థులకు తమ నామినేషన్లను దాఖలు చేసే అవకాశం మరికొద్ది గంటల్లో ముగుస్తుంది. ఈ తరుణంలో ఉన్న సమయం లోపు నామినేషన్లను దాఖలు చేసేందుకుగాను ఆశావాహులు మరింత ఆత్రుత కనబర్చు తున్నారు. తరువాత ఎలాగైనా నామినేషన్లు వేసిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఈ తరుణంలో కొన్ని డిమాండ్లను బరిలో ఉండే అభ్యర్థుల ముందు ఉంచి బరిలో నుంచి తప్పుకొని ప్రజల సంక్షేమం కోసం పాటు పడినట్లు అవుతుందని కొందరు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మరి కొందరు అయితే నామినేషన్లు వేసి నాలుగు రోజులు ప్రచారం చేసి తరువాత ఎలాగో మరో వ్యక్తికి మద్దతు తెలియజేస్తూ కాస్తోకూస్తో లాభం చూసుకుని ఉపసంహరణ చేసుకోకపోయిన బరిలో ఉండి ప్రచారం చేయకుండా ఇతరులకు మద్దతు తెలియజేద్దామనే ఆలోచనలలోనూ కొందరి అభ్యర్థుల మనస్సులో ఉన్నట్లు తెలుస్తున్నది.

జనాధరణ ఉన్న నేతలకు సీట్లు అంటున్న పార్టీలు
జనాధరణ ఉన్న నేతలకు మాత్రమే పార్టీల నుంచి బరిలో ఉండేందకు బీఫాంలను అందజేస్తామంటున్నారు పలు పార్టీల నాయకులు. ప్రజలకు మంచి చేయాలి అనే తపన ఉన్న వారికి కచ్చితంగా తమ పార్టీ మద్దతు ఉంటుంది అంటే తమ పార్టీ మద్దతు ఉంటుంది అంటూ మరింత ప్రచారాలు ఉపందుకుంటున్నాయి. పలు పార్టీల నుంచి కొన్ని వార్డులలో టిక్కెట్ల కోసం హోరాహోరీ పరిస్థితులు కనిపిస్తున్నాయి. టిక్కెట్ల సంగతి అటుంచితే బరిలో నిలబడుదాం.. మన మద్దతుదారులతో వార్డుల్లో ప్రచారం చేద్దాం మనకు ఉన్నది చూపిద్దాం అంటూ కొంత మంది అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. ప్రజాధారణతోపాటు పిలిచే పలికే నేతలే కావాలని ప్రజలు భావిస్తున్నారు.

ప్రశ్నించే స్థాయిలో ప్రజానీకం..
ఏదో ఓటు అడిగారు.. ఎంతో సమయం వృధాగా కూర్చుంటాం.. ఇలా పోలింగ్ బూత్ దగ్గరకు వెళ్లి అక్కడ ఒక్క ముద్ర వేసి వస్తే సరిపోతుంది అనుకొని అడుగులు వేసే రోజులకు కాలం చెల్లిందనే చెప్పాలి. అభ్యర్థులు తమకు ఓటు వేయాలంటే మీకు ఇంత ఇస్తాం.. మీ ఓటు మాకే వేయాలి అనే రోజులు రూపం మారుతున్నాయి. ఓటు వేయండి అంటూ వచ్చిన నేతలకు ఓటు వేస్తాం.. మీరు గెలుస్తారు.. మాకు అందుబాటులో ఉండరు.. అలాంటపుప్పుడు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసేదెవరు.. అంటూ ప్రజలు ఎదురు ప్రశ్నించే స్థాయికి వచ్చారని నాయకులు చెబుతున్నారు. ఎవరు ఉన్నారనేది కాకుండా.. పట్టణ అభివృద్ధి ఎలా జరుగుతుందనే ఆలోచనలకు పదును పెడుతూ ప్రజలు తమదైన శైలిలో ఓటు వేసే పనిలో నిమగ్నమవుతున్నారు.

ప్రజాధరణ ఉంటేనే బరిలో ఉందాం..
చాలా మంది పలు పార్టీల నేతలుగా ఉన్నప్పటికీ బీ-ఫాంలను ఇవ్వకుండానే బరిలో మేము సైతం అంటూ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. నేడు బీఫాంలను తీసుకుని మరో నామినేషన్ సెట్‌ను దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో భారీగా నామి నేషన్లు ఈ రోజు దాఖలు కానున్నాయి. ప్రజా అభిప్రాయం తీసుకొని బరిలో తరువాత ఉందాం అంటూ పలు వార్డుల్లో భార్య, భర్తలు కూడా నామినేషన్లను వేర్వేరుగా దాఖలు చేస్తున్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ ముందుకు సాగేలా ఆయా పార్టీల అభ్యర్థులు అడుగులు వేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రత్యేకతను చూపాలనే ఉద్దేశంతో ముందుడుగులు వేస్తుండటం గమనార్హం.


logo