కొల్లాపూర్ రూరల్, అక్టోబర్ 8: బతుకమ్మ చీరల పంపిణీ కొల్లాపూర్ మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నది. అంగన్వాడీ టీచర్లు, రేషన్ డీలర్ల ద్వారా చీరెల పంపిణీ కార్యక్రమం సజావుగా నడుస్తున్నది. గతంలో కంటే ఇప్పటి చీరలు బాగున్నాయని మహిళలు అంటున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతివార్డులో అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ ఉద్యోగుల సహకారంతో కమ్యూనిటీ హాల్, పాఠశాలలో నిలువ ఉంచి లబ్ధిదారుల పేర్లను నమోదుచేసుకుని చీరెలను పంపిణీ చేస్తున్నారు.
జటప్రోలులో
రాష్ట్రంలో అనేక ప్రజా సంక్షేమ పథకాలను చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైనారని జటప్రోలు సర్పంచ్ ఎస్కే ఖాజా అన్నారు. పెంట్లవెల్లి మండలం జటప్రోలు గ్రామంలో శుక్రవారం సర్పంచ్ మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు అనేక పథకాలతో ప్రయోజనాలను చేకూర్చుతున్నారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నూర్‌బాషా, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హనుమంతు, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు రవికుమార్, సీనియర్ నాయకులు పుల్లన్న, బంగా రు వెంకటస్వామి ,అంగన్వాడీ టీచర్ వెంకటమ్మ, వీఆర్వో, మహిళలు పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లిలో..
మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో బతుకమ్మ చీరెలను ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, జెడ్పీటీసీ గౌరమ్మ, సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డిమహిళలకు శుక్రవారం చీరెలు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో ఎంపీటీసీలు రేణుక, శశికళ, టీఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ నర్సింహ, టీఆర్ఎస్ నాయకులు రాజశేఖర్, నాగరాజు, వార్డు సభ్యులు డబ్బ ఎల్లయ్య, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పరమేశ్వర్, కురుమూర్తి తదితరులు ఉన్నారు.