e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home జోగులాంబ(గద్వాల్) ప్రాణాలు తీసిన అతివేగం

ప్రాణాలు తీసిన అతివేగం

  • శ్రీశైలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
  • ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
  • ఏడుగురు దుర్మరణం
  • మృతులంతా హైదరాబాద్‌ వాసులే..
  • సహాయక చర్యలు చేపట్టిన విప్‌ గువ్వల
  • సీఎం కేసీఆర్‌, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దిగ్భ్రాంతి

నాగర్‌కర్నూల్‌ (నమస్తే తెలంగాణ)/అచ్చంపేట, జూలై 23 : శ్రీశైల మల్లన్న దర్శనం నేపథ్యంలో అతి వేగం కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన నాగర్‌కర్నూల్‌ జి ల్లాలో చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం గండిగూడెం కా లనీకి చెందిన స్నేహితులు వంశీ, కార్తీక్‌, గణేశ్‌తో పాటు క్షతగాత్రుడు నరేశ్‌ (30) ఫోర్డిగో (ఏపీ 31 బీహెచ్‌ 224 7) కారులో గురువారం శ్రీశైలం క్షేత్రానికి చేరుకున్నా రు. శుక్రవారం మల్లన్నను దర్శించుకొని తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌ సుచిత్ర ప్రాంతానికి చెందిన కుటుంబ సభ్యులు సుబ్బలక్ష్మి (50), రామ్మూర్తి, శివకుమార్‌, శివ శుక్రవారం శ్రీశైలానికి కారు (టీఎస్‌ 10 యూసీ 3128)లో బయలుదేరారు. ఇలా రెండు కార్లు సాయంత్రం 6:30 గంటల సమయంలో అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం చెన్నారం-అయ్యవారిపల్లి మధ్య ఎదురెదురు గా ఢీకొన్నాయి. దీంతో రెండు కార్లు 20 మీటర్ల దూరం వరకూ పక్కకు జరిగాయి. ఈ ప్రమాదంలో కార్లు నుజ్జునుజ్జయ్యాయి. రెండు కార్లలోని మృతదేహాలు సైతం ఛిద్రంగా మారాయి. సుబ్బలక్ష్మి మృతదేహం రెండుగా చీలిపోయింది. తల రోడ్డుపై పడగా మిగతా దేహం కారులోనే ఇరుక్కుపోయింది. మిగిలిన ముగ్గురి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోగా పోలీసులు ముప్పావుగంట పాటు గడ్డపారలు, ఇతర పరికరాలతో అతి కష్టం మీద స్థానికుల సహకారంతో కారును పగులగొట్టి వె లికితీశారు. కారంతా ర క్తంతో నిండిపోయిం ది. మరో కారులోని డ్రై వర్‌ శివ మృ తదేహం సీటు మ ధ్యలోనే ఇరుక్కు పోయింది. ఇందులో కొందరి తల లు పగిలిపోయాయి. శరీరం లోపలి భాగాలు కూడా బయటికి వచ్చాయి. ఈ ఘటన తెలిసిన సమీప ప్రజలు, ఇతర వాహనదారులు ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి..
ఈ ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజుతో ఫోన్‌లో మాట్లాడి సంతాపం ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే ముందుగా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ఘటనా స్థలికి చేరుకోగా అనంతరం కలెక్టర్‌ శర్మన్‌ చౌహాన్‌, ఎస్పీ సాయిశేఖర్‌, ఇత ర అధికారులు సైతం చేరుకున్నారు. మృతదేహాలను ట్రాక్టర్‌లో అచ్చంపేట సివిల్‌ దవాఖానకు తరలించారు. రాత్రికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తీవ్రంగా గా యపడిన నరేశ్‌ మి యాపూర్‌ అపోలో దవాఖానలో పని చేస్తున్నాడని తెలిసింది. రెండు కాళ్లూ విరిగిన బాధితుడిని అ చ్చంపేటలో ప్రథమ చికిత్స అ నంతరం హైదరాబాద్‌కు తరలించారు. డీఎస్పీ నర్సింహులు స్వయంగా కార్లలో ఇరుక్కున్న శవాలను భుజాలపై మో స్తూ బయటకు తీసుకొచ్చారు.
డీఎంహెచ్‌వో సుధాకర్‌లాల్‌, నియోజకవర్గానికి చెందిన అధికారులు, ఆర్డీవో పాండునాయక్‌, సీఐలు అనుదీప్‌, రామకృష్ణ, ఎస్సైలు రమేశ్‌, ప్రదీప్‌, రాజు, కృష్ణయ్య, తాసిల్దార్లు కృష్ణయ్య, చంద్రశేఖర్‌ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana