e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, December 6, 2021

ఆగ్రహ జ్వాల

  • దళితబంధు నిలిపివేతపై అలంపూర్‌ చౌరస్తాలో నిరసన
  • కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
  • బాగు కోసమే దళితబంధు : ఎమ్మెల్యే అబ్రహం

దళితబంధు పథకం నిలిపివేయడంపై ఆగ్రహం పెల్లుబికింది. మండలంలోని అలంపూర్‌ చౌరస్తాలో మంగళవారం ని రసన చేపట్టారు. ఎమ్మెల్యే అబ్రహం, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, దళిత నాయకులు ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం నుంచి ర్యాలీగా చౌరస్తాకు చేరుకొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినదించారు. ధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహ నం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం మాట్లాడుతూ దళితుల బతుకులను బాగు చేయ డం కోసమే దళిత బంధును సీఎం కేసీఆర్‌ అమ లు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ నాయకుల అరాచకాలు రోజురోజుకూ శృతిమించిపోతున్నాయని ఆరోపించారు. హుజురాబాద్‌లో జరిగే ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నేతలు దళితబంధుపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం సరికాదన్నారు. దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి వ్యతిరేకి అయిన బీజేపీని బొందపెట్టేందుకే హుజురాబాద్‌తోపాటు రాష్ట్రంలోని దళిత ప్రజలు సిద్ధం గా ఉన్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తనయుడు అజయ్‌, అలంపూర్‌, అయిజ, వడ్డేపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్లు మనోరమ, కరుణశ్రీ, చైర్మన్‌ చిన్నదేవన్న, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రమణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం..
దళితబంధు పథకాన్ని అడ్డుకోవడం బీజేపీకి తగదని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ హనుమంతరావు, ఎంపీపీ మ ధు, టీఆర్‌ఎస్‌ మండ లాధ్యక్షుడు నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో బీజే పీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్‌ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. తరతరాలుగా వెనుకబాటుకు గురవుతున్న దళితులకు ఈ పథకం ద్వారా ఆర్థిక స్వావలంబన లభిస్తున్నదన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు హుజురాబాద్‌ ఎన్నికలను సాకుగా చూపు తూ దళితబంధును అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలో గెలుపు కోసం ప్రయత్నించాలే త ప్పా పథకాలను అడ్డుకోవద్దన్నారు. కార్యక్రమం లో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు మాధవరెడ్డి, ఎంపీటీసీ రమేశ్‌, మండల కార్యదర్శి శ్రీనివాసులు, నాయకులు సత్యం, బంగారయ్య, కృ ష్ణారెడ్డి, రాములు, లక్ష్మారెడ్డి, నర్సింహ ఉన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement