e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జయశంకర్ కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ములుగు రూరల్‌/వాజేడు/వెంకటాపూర్‌/మంగపేట/ భూపాలపల్లి టౌన్‌: మే 25 : జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా సాగుతోంది. మంగళవారం నుంచి కోవాగ్జిన్‌ రెండో డోస్‌ టీకాలను అందించగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ములుగు ఎస్సై డీవీ ఫణి స్వయంగా అందరికీ టోకెన్లును అందించారు. టీకా సెంటర్‌ను డీఎంహెచ్‌వో అప్పయ్య సందర్శించి, టీకాలు వేస్తున్న తీరును పరిశీలించారు. అలాగే, వాజేడు మండలంలోని పేరూరు పీహెచ్‌సీ పరిధిలో 60మందికి, వాజేడు పీహెచ్‌సీ పరిధిలో 40 మందికి రెండో డోస్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు అధికారులు తెలిపారు. మొదటి డోస్‌ వేసుకున్న ప్రతి ఒక్కరూ గడువులోగా రెండో డోస్‌ వేయించుకోవాలని తహసీల్దార్‌ అల్లం రాజ్‌కుమార్‌ సూచించారు. అలాగే, వాజేడు పీహెచ్‌సీలో 73 మందికి కరోనా పరీక్షలు చేయగా 18 మందికి, పేరూరులో 50 మందికి పరీక్షలు చేయగా 8 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి సీతారామరాజు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో మంకిడి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో కే చంద్రశేఖర్‌, ఆర్‌ఐ హరిమురళీ కృష్ణ, హెల్త్‌సూపర్‌వైజర్‌ కోటిరెడ్డి పాల్గొన్నారు. వెంకటాపూర్‌ మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో166 మందికి రెండో డోస్‌ వాక్సినేషన్‌ వేసినట్లు వైద్యాధికారి వినయ్‌ భాస్కర్‌ తెలిపారు. 82 మందికి కరోనా పరీక్షలు చేయగా 22 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు సంబంధిత పీహెచ్‌సీలో రెండో డోస్‌ వేయించుకోవాలని ఎంపీడీవో ఇక్బాల్‌ హుస్సేన్‌, మంగపేట తహసీల్దార్‌ బాజ్జీ ప్రసాద్‌ కోరారు. అలాగే, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో టీకా పంపిణీ మళ్లీ ప్రారంభమైందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సుధార్‌సింగ్‌ తెలిపారు. 45 ఏళ్లు నిండిన వారంతా రిజిస్ర్టేషన్‌ చేయించుకుని టీకా వేయించుకోవాలని ఆయన కోరారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ట్రెండింగ్‌

Advertisement