e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home ములుగు కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి

కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి

కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి

మంగపేట, జూన్‌8: కరోనా బాధితులు ధైర్యంగా ఉండి వైద్యుల సలహాలు పాటించాలని టీఆర్‌ఎస్‌ ములుగు జిల్లా సీనియర్‌ నాయకుడు పోరిక గోవిందనాయక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని చెరుపల్లిలో కొవిడ్‌ బాధిత కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏఎన్‌ఎం, ఆవ వర్కర్లను శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ 50 డయాగ్నస్టిక్‌ కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాని, కరోనా కష్టకాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన అందిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ సామా మోహన్‌రెడ్డి, మేడారం డైరెక్టర్‌ చిలుకమర్రి రాజేందర్‌, సహకార సంఘ డైరెక్టర్లు అచ్చ సత్యనారాయణ, సిద్ధంశెట్టి లక్ష్మణ్‌రావు, మండల ఉపాధ్యక్షుడు పబ్బోజు సత్యనారాయణచారి, శ్యామల్‌నాయక్‌, బట్ట నర్సింహారావు, బాలు, తుక్కాని శ్రీను, చంద్రం, పసుపులేటి శ్రీనివాస్‌, చందర్‌రావు, రాగం రవి, యగ్గడి అర్జున్‌, చిట్టిబాబు, ప్రశాంత్‌, సంపత్‌, మీడియా ఇన్‌చార్జి గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో కిట్లు అందజేత
వాజేడు: మండలంలోని బోల్లారం, అరుణచలపురం, ఘణపురం, బిజినేపల్లి, దూలపురం, చెరుకు రు, శ్రీరాంనగర్‌, ములకనపల్లి, కృష్ణాపురం గ్రామా ల్లో కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న 81 కుటుంబాలకు ఐటీడీఏ ఇచ్చి కరోనా కిట్లను మంగళవారం రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అం దజేశారు. ఎంపీపీ శ్యామాల శారద, తహసీల్దార్‌ అల్లం రాజ్‌కుమార్‌, ఆర్‌ఐ హరి మురళీకృష్ణ, మొరుమురు సర్పంచ్‌ పూసం నరేశ్‌, ఉపసర్పంచ్‌ గౌరరాపు కోటేశ్వరరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఏఎంఆర్‌ కంపెనీ ఆధ్వర్యంలో..
మల్హర్‌: మండలంలోని తాడిచెర్ల ఓసీపీ బ్లాక్‌-1 పనులు నిర్వహిస్తున్న ఏఎంఆర్‌ కంపెనీ ఆధ్వర్యంలో 12మంది కొవిడ్‌ బాధితులకు నిత్యావసర సరుకులు అందజేశారు. కంపెనీ ఎండీ మహేశ్‌రెడ్డి ఆదేశాలతో ప్రాజెక్టు హెడ్‌ ప్రభాకర్‌రెడ్డి సూచనల మేరకు సీపీఆర్‌వో వెంకట్‌, సీఎస్‌ఆర్‌ సూపర్‌వైజర్లు బొబ్బిలి నరేశ్‌, నారమల్ల నరేశ్‌, నవీన్‌రావు, రాహుల్‌ సరుకులు అందజేశారు. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఏఎంఆర్‌, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

మాస్కులు, ఓఆర్‌ఎస్‌ పంపిణీ
భూపాలపల్లి టౌన్‌: జంగేడులోని జడ్పీహెచ్‌ఎస్‌లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్న ఆశ వర్కర్లు, మున్సిపల్‌ సిబ్బందికి సాయికృష్ణ మెడికల్‌ స్టోర్‌ యజమాని కూచన కిషన్‌ప్రసాద్‌ మాస్కులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం నవీన పాల్గొన్నారు.

విలాసాగర్‌లో..
కాటారం: విలాసాగర్‌ గ్రామంలో 28 మంది కరోనా బాధితులకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వైస్‌ ఎంపీపీ చీర్ల తిరుమల తిరుపతిరెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వేమునూరి ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ సంతోష్‌రావు, చీర్ల తిరుపతిరెడ్డి, అందె సత్యం, చిగురు రాజు, రాయసాగర్‌, వెంకటస్వామి ఉన్నారు.

కరోనా బాధితులకు పరామర్శ
మహాముత్తారం: కరోనా బాధితులు జాగ్రత్తలు పాటించాలని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నా రు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కరోనా పరీక్షలను పరిశీలించి వైద్య సిబ్బంది, జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. జడ్పీటీసీ శారద, ఎంపీపీ రత్నం, సింగిల్‌విండో డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలి

ట్రెండింగ్‌

Advertisement