e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ములుగు జిల్లాలో మృగశిర సందడి

జిల్లాలో మృగశిర సందడి

జిల్లాలో మృగశిర సందడి

కృష్ణకాలనీ/ములుగురూరల్‌/గోవిందరావుపేట/కాటారం/వెంకటాపూర్‌, జూన్‌ 8: రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణీ కార్తె ముగిసి.. చల్లబరిచే మృగశిర మొదలవడంతో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో మంగళవారం మృగశిరకార్తె సందడి నెలకొంది. ఈ రోజున ప్రతి ఇంట్లో చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. దీనివెనుక ఆరోగ్య రహస్యం కూడా ఉండడంతో చేపలు కొనేందుకు ప్రజలు భారీగా తరిలి వచ్చారు. చేపల్లో అనేక మాంసకృత్తులతోపాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయని, గుండె జబ్బులు, అస్తమ, మధుమేహ వ్యాధి ఉన్నవారు, గర్భిణులు చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. జిల్లా కేంద్రాలతోపాటు మల్లంపల్లి, జంగాలపల్లి, పత్తిపల్లి, దేవగిరిపట్నం, మహ్మద్‌గౌస్‌పల్లి, సర్వాపురం, కాసిందేవిపేట చేపలకు భలే గిరాకీ ఉంది. దీంతో మత్స్యకారులు ధరలను అ మాంతం పెంచేశారు. బొమ్మె కిలో రూ.600 నుంచి రూ.850, బంగారుతీగలు, బొచ్చె తదితర రకాల చేపలు అమ్ముడు పోయే విధానాన్ని బట్టి రూ.400నుంచి రూ.550 వరకు విక్రయి స్తున్నారు. అయినా కొనేందుకు ముందుకు వచ్చారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లాలో మృగశిర సందడి

ట్రెండింగ్‌

Advertisement