మంగళవారం 04 ఆగస్టు 2020
Mulugu - Jul 27, 2020 , 21:00:06

ములుగు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ములుగు జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ములుగు : మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం జలగలవంచ గొత్తికోయగుంపులో చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన మడకం అనిల్‌ అనే వ్యక్తిని మంత్రాలు చేస్తున్నాడన్న అనుమానంతో అత్యంత దారుణంగా హత్య చేశారు. అనిల్‌ మంత్రాలు చేస్తున్నాడని అనుమానించిన పురకసం బద్రీ, మడకం మంగయ్యలు అతనిపై దాడి చేశారు.

గొడ్డలితో నరికి, కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo