మంగళవారం 09 మార్చి 2021
Mulugu - Jan 28, 2021 , 00:36:17

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

వాజేడు, జనవరి 27 : మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయాలని ఎంపీడీవో కే చంద్రశేఖర్‌ సూచించారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో బుధవారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సరీలతో పాటు  హరితహారం మొక్కల సంరక్షణపై దృష్టిసారించాలని ఆదేశించారు. అలాగే డంపింగ్‌యార్డులు తదితర నిర్మాణాలు పూర్తి చేయాలని  సూచించారు. సమావేశంలో ఎంపీవో షాజిదాబేగం, సర్పంచులు జెజ్జరి మేనక, వాసం కృష్ణవేణి, బోదెబోయిన సరళ, సమ్మక్క, పంచాయతీ కార్యదర్శులు  నిమ్మాటూరి వెంకటేశ్వర్‌రావు, అశోక్‌, ఈజీఎస్‌ ఏపీవో మహ్మద్‌ అంకూస్‌, టీఏలు సర్వేశ్వర్‌రావు, వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌, లక్ష్మణ్‌, సురేశ్‌, సరిత, శరీష  తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo