ఆదివారం 07 మార్చి 2021
Mulugu - Jan 27, 2021 , 01:58:02

రాష్ట్రపతి అవార్డుకు ముగ్గురు ఎంపిక

రాష్ట్రపతి అవార్డుకు ముగ్గురు ఎంపిక

పోచమ్మమైదాన్‌, జనవరి 26: తెలంగాణ జైళ్ల శాఖలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న ముగ్గురు వరంగల్‌ సెంట్రల్‌ జైలు అధికారులు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. 2021 సంవత్సరానికి రాష్ట్రపతి కరెక్షనల్‌ సర్వీస్‌ మెడల్స్‌ అవార్డుకు ఎంపికైన వీరికి వచ్చే సంవత్సరంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఎంపికైన వారిలో చీఫ్‌ హెడ్‌ వార్డర్లు జీ సోమశేఖర్‌రెడ్డి, వీ చంద్రయ్య, జీ డైనమ్మ ఉన్నట్లు కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎన్‌ మురళీబాబు తెలిపారు. రాష్ట్రపతి అవార్డుకు ఎంపికైన ముగ్గురు అధికారులను అభినందించారు.


VIDEOS

logo